73వ గణతంత్ర దినోత్సవం వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. ఈ క్రమంలో టాలీవుడ్ స్టార్స్ రిపబ్లిక్ డే సెలెబ్రేషన్స్ లో ఉన్నారు. మెగాస్టార్ చిరంజీవి సోషల్ మీడియా ద్వారా అభిమానులకు గణతంత్ర దినోత్సవం విషెస్ తెలియజేయగా, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హైదరాబాద్ జనసేన పార్టీ కేంద్ర కార్యాలయంలో జాతీయ పతాకాన్ని ఎగురవేసి వందనం సమర్పించారు. ఇక మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తన మామ, నిర్మాత అల్లు అరవింద్‌తో కలిసి జాతీయ జెండాను ఎగురవేశారు. రామ్ చరణ్ జెండాను ఎగురవేసి, సెల్యూట్ చేస్తున్న పిక్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. చెర్రీ సాధారణ దుస్తులు ధరించి సూపర్ కూల్ గా కనిపిస్తున్నాడు. ఇక మెగా హీరోలు మాత్రమే కాకుండా పలువులు స్టార్ హీరోలు సోషల్ మీడియా ద్వారా అభిమానులకు గణతంత్ర దినోత్సవం విషెస్ తెలియజేస్తున్నారు.
Read Also : పవర్ స్టార్ కోసం కన్నడ డిస్ట్రిబ్యూటర్ల షాకింగ్ డెసిషన్
