మాస్ కా దాస్ విశ్వక్ సేన్ నటిస్తున్న గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి సినిమా రిలీజ్ డేట్ డిసెంబర్ నుంచి 2024 మార్చ్ కి వాయిదా పడింది. ఈ సినిమా పోస్ట్ పోన్ అవ్వడంతో పాటు మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ నటిస్తున్న ఆపరేషన్ వ్యాలెంటైన్ కూడా రిలీజ్ డిలే అయ్యింది. ఈ రెండు సినిమాలు వాయిదా పడడంతో డిసెంబర్ ఫస్ట్ వీక్ లో బాక్సాఫీస్ వార్ నాని అండ్ నితిన్ మధ్య జరగనుంది. నలుగురు హీరోల మధ్య జరగాల్సిన బాక్సాఫీస్ ఫైట్ ఇప్పుడు ఇద్దరు హీరోల మధ్య మాత్రమే జరుగుతోంది. కేవలం ఒకరోజు గ్యాప్ లో నాని నటించిన హాయ్ నాన్న… నితిన్ నటించిన ఎక్స్ట్రాడినరీ మ్యాన్ సినిమాలు రిలీజ్ అవుతున్నాయి. నాని-మృణాల్ ఠాకూర్ ఠాకూర్ జంటగా నటించిన హాయ్ నాన్న సినిమా ఎమోషనల్ డ్రామాగా ప్రమోట్ అవుతుంది.
పాన్ ఇండియా స్థాయిలో రిలీజ్ కానున్న హాయ్ నాన్న సినిమాలో ఫాదర్ అండ్ డాటర్ ఎమోషన్ మెయిన్ పాయింట్ అయ్యేలా ఉంది. నాని మార్క్ ఎమోషనల్ సీన్స్ పడితే హాయ్ నాన్న సినిమాకి మంచి రెస్పాన్స్ రావడం గ్యారెంటీ. అలానే నితిన్ నటించిన ఎక్స్ట్రాడినరీ మ్యాన్ సినిమాకి కూడా పాజిటివ్ బజ్ ఉంది. నితిన్ చాలా రోజుల తర్వాత కామెడీ సినిమా చేయడం, ట్రైలర్ మంచి రెస్పాన్స్ తెచ్చుకోవడంతో సినిమాకు టాక్ బాగుంటే ఫ్యామిలీ ఆడియన్స్ థియేటర్స్ కి రావడం గ్యారెంటీ. హాయ్ నాన్న, ఎక్స్ట్రాడినరీ మ్యాన్ సినిమాలు వేరు వేరు జానర్స్ కాబట్టి ఈ సినిమాల కలెక్షన్స్ పెద్దగా తారుమారు అయ్యే అవకాశం కనిపించట్లేదు కానీ ఎవరు ఫ్యామిలీ ఆడియన్స్ ని థియేటర్స్ కి ఎక్కువగా పుల్ చేస్తారో వాళ్లే లాంగ్ రన్ లో హిట్ కొట్టగలరు. మరి నాని-నితిన్ ల వార్ లో గెలిచేదెవరో చూడాలి.
