NTV Telugu Site icon

Krishnaveni: నా భర్తను ఆ హీరోయినే హత్య చేయించింది.. కరెంట్‌ వైర్లతో కాల్చి, పీక పిసికి..

krishnaveni

krishnaveni

సినిమా ఒక రంగుల ప్రపంచం. ఇక్కడ సపోర్ట్ గా ఉండేవాళ్లు కన్నా వెనకనుంచి గోతులు తీసేవారే ఎక్కువ. కొద్దిగా ఫేమ్ వచ్చినా .. వారిని వెనక్కి ఎలా లాగాలి అనే చూస్తుంటారు. ఇలా వెనక పడినవారు కొంతమంది మృత్యువాత పడ్డారు.. మరికొంతమంది ఇండస్ట్రీని వదిలి వెళ్లిపోయారు. ఇది ఇప్పటినుంచే కాదు మొదటి నుచ్న్హి ఉన్నదే. తాజాగా సీనియర్ నటి తన జీవితంలో జరిగిన చేదు ఘటనలను, తన భర్తను ఇండస్ట్రీ ఎలా తొక్కేసింది అనేది చెప్పుకొచ్చింది. టాలీవుడ్ సీనియర్ నటి కృష్ణవేణి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. లేడీ కమెడియన్ గా ఆమె ఎన్నో సినిమాలో నటించారు. తన సినిమాలకు దర్శకత్వం వహించిన రాజాచంద్రను వివాహమాడారు. అయితే ఆ వివాహం గురించి ఆమె ఇటీవల ఒక ఇంటర్వ్యూలో ఈ విధంగా చెప్పుకొచ్చారు.

“నేను రాజాచంద్రను అనుకోని పరిస్థితిల్లో పెళ్లి చేసుకోవాల్సి వచ్చింది. అస్సలు నాకు నలుపు అంటేనే నచ్చదు. అలాంటిది నల్లగా ఉండే రాజా చంద్రను వివాహమాడను అంటే కొన్ని అనివార్య కారణాలు అప్పుడు అలా చేశాయి. మా పెళ్లి జరిగేటప్పటికే ఆయనకు పెళ్ళై ముగ్గురు పిల్లలు ఉన్నారు. ఒక పక్క సినిమాలతో ఆయన బిజీగా మారిపోయారు. చిన్న అద్దె ఇంట్లో ఉండే ఆయన వరుస సినిమాల విజయాలతో లక్షలు తీసుకునే రేంజ్ కి వచ్చారు. అది చాలామందికి నచ్చలేదు. ఇండస్ట్రీలో ఉండే ఒక హీరోయిన్ కన్ను మా ఆయనపై పడింది. ఆమెతో కలిసి ఇండస్ట్రీ వాళ్లే నా భర్తను చంపేశారు. కరెంట్‌ వైర్లతో కాల్చి, పీక పిసికి ఊపిరాడకుండా చేసి చంపేశారు. ఆయనను ఎవరు చంపారో పోలీసులకు కూడా తెలుసు. కానీ వారు ఏమి చేయలేమని చేతులెత్తేశారు. ఎక్కువ మాట్లాడితే మమ్మల్ని కూడా చంపేస్తామని బెదిరించారు. రెండేళ్లు ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని బతికాం” అంటూ చెప్పుకొచ్చింది. ఇండస్ట్రీలో ఇలాంటి ఘటనలు జరుగుతాయి అనేదానికి ఇది కూడా ఒక ఉదాహరణ అని నెటిజన్స్ కామెంట్స్ పెడుతున్నారు.

Show comments