Krishnaveni: నా భర్తను ఆ హీరోయినే హత్య చేయించింది.. కరెంట్ వైర్లతో కాల్చి, పీక పిసికి..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
సినిమా ఒక రంగుల ప్రపంచం. ఇక్కడ సపోర్ట్ గా ఉండేవాళ్లు కన్నా వెనకనుంచి గోతులు తీసేవారే ఎక్కువ. కొద్దిగా ఫేమ్ వచ్చినా .. వారిని వెనక్కి ఎలా లాగాలి అనే చూస్తుంటారు. ఇలా వెనక పడినవారు కొంతమంది మృత్యువాత పడ్డారు.. మరికొంతమంది ఇండస్ట్రీని వదిలి వెళ్లిపోయారు. ఇది ఇప్పటినుంచే కాదు మొదటి నుచ్న్హి ఉన్నదే. తాజాగా సీనియర్ నటి తన జీవితంలో జరిగిన చేదు ఘటనలను, తన భర్తను ఇండస్ట్రీ ఎలా తొక్కేసింది అనేది చెప్పుకొచ్చింది. టాలీవుడ్ సీనియర్ నటి కృష్ణవేణి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. లేడీ కమెడియన్ గా ఆమె ఎన్నో సినిమాలో నటించారు. తన సినిమాలకు దర్శకత్వం వహించిన రాజాచంద్రను వివాహమాడారు. అయితే ఆ వివాహం గురించి ఆమె ఇటీవల ఒక ఇంటర్వ్యూలో ఈ విధంగా చెప్పుకొచ్చారు.
“నేను రాజాచంద్రను అనుకోని పరిస్థితిల్లో పెళ్లి చేసుకోవాల్సి వచ్చింది. అస్సలు నాకు నలుపు అంటేనే నచ్చదు. అలాంటిది నల్లగా ఉండే రాజా చంద్రను వివాహమాడను అంటే కొన్ని అనివార్య కారణాలు అప్పుడు అలా చేశాయి. మా పెళ్లి జరిగేటప్పటికే ఆయనకు పెళ్ళై ముగ్గురు పిల్లలు ఉన్నారు. ఒక పక్క సినిమాలతో ఆయన బిజీగా మారిపోయారు. చిన్న అద్దె ఇంట్లో ఉండే ఆయన వరుస సినిమాల విజయాలతో లక్షలు తీసుకునే రేంజ్ కి వచ్చారు. అది చాలామందికి నచ్చలేదు. ఇండస్ట్రీలో ఉండే ఒక హీరోయిన్ కన్ను మా ఆయనపై పడింది. ఆమెతో కలిసి ఇండస్ట్రీ వాళ్లే నా భర్తను చంపేశారు. కరెంట్ వైర్లతో కాల్చి, పీక పిసికి ఊపిరాడకుండా చేసి చంపేశారు. ఆయనను ఎవరు చంపారో పోలీసులకు కూడా తెలుసు. కానీ వారు ఏమి చేయలేమని చేతులెత్తేశారు. ఎక్కువ మాట్లాడితే మమ్మల్ని కూడా చంపేస్తామని బెదిరించారు. రెండేళ్లు ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని బతికాం” అంటూ చెప్పుకొచ్చింది. ఇండస్ట్రీలో ఇలాంటి ఘటనలు జరుగుతాయి అనేదానికి ఇది కూడా ఒక ఉదాహరణ అని నెటిజన్స్ కామెంట్స్ పెడుతున్నారు.
Also Read
తాజావార్తలు
-
Harish Rao : హనుమకొండలో హైటెన్షన్.. ధర్నా తర్వాత హరీశ్ రావు అరెస్ట్..
-
TOXIC : టాక్సిక్ టాక్ ఏంటి.. డే-1 ఈ కలెక్షన్స్ ఏంటి?
-
Trump: ట్రంప్ సంచలన నిర్ణయం.. ఉగ్ర దేశ జాబితా నుంచి ఆ దేశం తొలగింపు
-
Tamil Nadu: పందెంకోడి మిస్సింగ్.. వాట్సాప్లో ఆరా.. యువకుల మధ్య తీవ్ర ఘర్షణ
-
Nepal Floods: నేపాల్లో చిక్కుకున్న ఏపీ యాత్రికులపై మంత్రి లోకేష్ సమీక్ష.. ముగ్గురి ఆచూకీ కోసం ముమ్మర ప్రయత్నాలు!
ట్రెండింగ్
-
MS Dhoni-CSK: సీఎస్కేలో ధోనీకి 25 శాతం వాటానా?.. ఫ్రీగా ఎవరైనా ఇస్తారా?.. మాజీ టీమిండియా ప్లేయర్ సంచలన వ్యాఖ్యలు!
-
కేవలం రూ.7,999కే.. 5000mAh బ్యాటరీ, LED ఫ్లాష్ కెమరాతో Lava Bold N4 Lite లాంచ్..!
-
రూ.14,999కే మిలిటరీ-గ్రేడ్ డ్యూరబిలిటీ, 6500mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లే.. Realme C100i 4G ఫోన్ లాంచ్.!
-
Paneer Bhurji Recipe: పప్పు, కూరలతో బోర్ కొడుతోందా.? అయితే “పనీర్ భుర్జీ”తో కొత్త టేస్ట్ ఆస్వాదించండి..!
-
Guinness World Record: లక్ష అడుగుల ఎత్తు నుంచి ఫోన్ను పడేసినా.. ఒక్క గీత కూడా పడలేదు.! అసలు మ్యాజిక్ ఏంటంటే?