NTV Telugu Site icon

Mohan Babu: హీరో పెళ్ళికి హాజరు కాలేనని తెలిసి.. మోహన్ బాబు ఏం చేశాడో తెలుసా..?

Mohan

Mohan

Mohan Babu: టాలీవుడ్ స్టార్ నిర్మాత దిల్ రాజు ఇంట పెళ్లి సందడి మొదలుకానుంది. దిల్ రాజు తమ్ముడు, నిర్మాత శిరీష్ తనయుడు ఆశిష్ పెళ్లి వేడుకలు మొదలయ్యాయి. రౌడీ బాయ్స్ సినిమాతో హీరోగా తెలుగు సినిమా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన ఆశిష్..ప్రస్తుతం సెల్ఫిష్ సినిమా చేస్తున్నాడు. ఇక ఈ మధ్యనే అద్వైత రెడ్డి అనే అమ్మాయితో అతనికి ఎంగేజ్ మెంట్ కూడా జరిగింది. ఫిబ్రవరి 14 న జైపూర్ లో వీరి పెళ్లి ఘనంగా జరగనుంది. ఈ క్రమంలోనే దిల్ రాజు ఫ్యామిలీ పలువురు సెలబ్రిటీలను కలిసి వారికి శుభలేఖలు అందజేస్తున్నారు.

ఇప్పటికే తెలుగు సినీ పరిశ్రమ నుంచి మెగాస్టార్ చిరంజీవి, జూ.ఎన్టీఆర్, ప్రభాస్, అఖిల్‌కి కూడా ఆహ్వాన పత్రికలు అందజేశారు. ఇక అదే విధంగా తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి సీఎం కేసీఆర్‌ని కూడా నిర్మాత దిల్ రాజు కలిశారు. ఇందిరానగర్‌లోని కేసీఆర్‌ని కలిసిన దిల్ రాజు తన తమ్ముడు శిరీష్ రెడ్డి కుమారుడు ఆశిష్ రెడ్డి పెళ్లికి రావాలని శుభలేఖ అందజేశారు. ఆ సంగతి అలా ఉంచితే ఇప్పుడు దిల్ రాజు ఫ్యామిలీ తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిని కలిసి వివాహానికి ఆహ్వానించారు. తాజాగా ఈ కొత్త జంట.. మంచు ఫ్యామిలీని తమ పెళ్ళికి ఆహ్వానించారు. మంచు మోహన్ బాబు ఇంటికి వెళ్లి .. ఆయనకు పెళ్లి పత్రికను అందజేశారు. ఈ సందర్భంగా కాబోయే నూతన వధువరులను మెహన్‌బాబు ఆశీర్వదించారు. అయితే వారి పెళ్ళికి మోహన్ బాబు హాజరు కాలేకపోతున్నారని తెలుస్తోంది. ఆ సమయానికి మోహన్ బాబు ఇండియాలో ఉండడం లేదట. అందుకే నూతన జంటకు వారి పూజా మందిరం వద్ద దండలు మార్పించి ఆశీర్వాదాలు అందించారు. ఇందుకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు నెట్టింట వైరల్ గా మారాయి.

Show comments