పవన్ కళ్యాణ్, రానా కలిసి నటిస్తున్న చిత్రం “అయ్యప్పనుమ్ కోషియమ్” తెలుగు రీమేక్. ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇక సినిమాకు సంబంధించిన ఫస్ట్ గ్లింప్సె, టైటిల్ ఆగష్టు 15న స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా రిలీజ్ చేస్తామని ప్రకటించడం మెగా అభిమానులను హుషారెత్తించింది. అయితే ఇప్పుడు సినిమా టైటిల్ విషయంలో పలు ఊహాగానాలు విన్పిస్తున్నాయి. తాజా సమాచారం ప్రకారం ఈ సినిమాకు “భీమ్లా నాయక్” అనే టైటిల్ ను ఖరారు చేశారని తెలుస్తోంది. రీసెంట్ గా ఈ చిత్రంలో పవన్ కళ్యాణ్ పాత్ర పేరు భీమ్లా నాయక్ అని మేకర్స్ ప్రకటించిన వెంటనే ఈ టైటిల్ వైరల్ అయింది. ఈ టైటిల్ ఇప్పటికే అందరి దృష్టిలో ప్రత్యేకంగా నిలిచిపోయింది కాబట్టి మేకర్స్ సినిమాకు అదే టైటిల్ లాక్ చేశారని సమాచారం. రేపు విడుదల కానున్న టైటిల్ పోస్టర్ చూస్తే అసలు టైటిల్ ఏంటో తెలుస్తుంది.
Read Also : ఈ సినిమాలో చైతన్య ట్రాజిక్ ఎండింగ్ ?
ఈ రీమేక్ కు సాగర్ కె చంద్ర దర్శకత్వం వహిస్తున్నారు. సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై సూర్యదేవర నాగవంశీ నిర్మిస్తున్న ఈ ప్రాజెక్ట్ కు త్రివిక్రమ్ స్క్రీన్ ప్లే, మాటలు రాస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం హైదరాబాద్‌లో జరుగుతోంది. స్టార్ కంపోజర్ థమన్ సంగీతం అందిస్తున్నారు. నిత్యామీనన్ పవన్ కళ్యాణ్ భార్య పాత్రలో కనిపించనుంది. ఈ యాక్షన్ డ్రామాలో రానా దగ్గుబాటి సరసన ఐశ్వర్య రాజేష్ నటిస్తోంది. సెప్టెంబర్ 2న పవన్ కళ్యాణ్ తన పుట్టినరోజు జరుపుకోనున్నారు. ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్, రానా దగ్గుబాటి సినిమాలో నుంచి మొదటి పాటను సెప్టెంబర్ 2 న విడుదల చేయబోతున్నారు.
