Site icon NTV Telugu

NBK 107: బాలకృష్ణకు ఊర మాస్ టైటిల్ ఫిక్స్.. ఇక ఫ్యాన్స్ కు పూనకాలే

NBK107

నందమూరి బాలకృష్ణ గతేడాది ‘అఖండ’ చిత్రంతో భారీ విజయాన్ని అందుకున్న విషయం విదితమే. ఇక ఈ సినిమా తరువాత  బాలయ్య బాబు, గోపీచంద్ మలినేని దర్శకత్వంలో తన తదుపరి ప్రాజెక్ట్ ను స్టార్ట్ చేశారు. ఇప్పటికే శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ చిత్రంలో బాలయ్య సరసన శృతి హాసన్ నటిస్తోంది. ఇక ‘అఖండ’ తరువాత వస్తున్న చిత్రం కావడంతో ఈ చిత్రంపై ప్రేక్షకులు భారీ అంచనాలు పెట్టుకున్నారు. ఇక ప్రేక్షకుల అంచనాలకు తగ్గట్టే డైరెక్టర్ కూడా ఊర మాస్ ఎలిమెంట్స్ ని గుప్పిస్తున్నట్లు సమాచారం. ఇప్పటికే ఈ సినిమాలోని బాలయ్య ఫస్ట్ లుక్ విశేషంగా ఆకట్టుకుంది. ఇక తాజాగా ఈ సినిమా టైటిల్ ఇదే అంటూ సోషల్ మీడియాలో వార్తలు గుప్పుమంటున్నాయి.  ఇప్పటికే ‘జై బాలయ్య’, ‘పెద్దన్నయ్య’, ‘నట సింహం’  వంటి టైటిల్స్ నెట్టింట జోరుగా వైరల్ అయినా సంగతి తెలిసిందే. ఇక తాజాగా ఈ సినిమా టైటిల్ ను మేకర్స్ ఫిక్స్ చేశారట.

`ఎన్బీకే 107` కు మేకర్స్ `అన్నగారు’ అనే టైటిల్ ను లాక్  చేసినట్లు సమాచారం. ఇక ఈ చిత్రమో బాలకృష్ణ డబుల్ రోల్ లో కనిపించనున్నారని టాక్ వినిపిస్తోంది. అందులోఒక బాలకృష్ణ ‘అన్నగారు’ అని , మరో బాలకృష్ణ మోడ్రన్ లుక్ లో  కనిపిస్తాడని టాక్. జూన్ 10న బాలయ్య పుట్టిన రోజు. ఆయన బర్త్ డే ట్రీట్ గా `ఎన్బీకే 107` టీజర్ మరియు టైటిల్ ను అఫీషియల్ గా అనౌన్స్ చేయనున్నారని సోషల్ మీడియాలో జోరుగా టాక్ నడుస్తోంది. దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. ఇక దీంతో బాలయ్య ఫ్యాన్స్ రచ్చ షురూ చేశారు. మరి ఈ వార్తలో నిజమెంత అనేది తెలియాలంటే ఇంకొన్ని రోజులు ఓపిక పట్టాల్సిందే.

Exit mobile version