Site icon NTV Telugu

Tillu Square: రాధికా జాతి ఆడవాళ్లకు టిల్లు జీవితం అంకితం

Tillu

Tillu

Tillu Square: స్టార్ బాయ్ సిద్ధు జొన్నలగడ్డ, అనుపమ పరమేశ్వరన్ జంటగా మల్లిక్ రామ్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం టిల్లు స్క్వేర్. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్‌ పతాకంపై సూర్యదేవర నాగవంశీ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ సహ నిర్మాతగా వ్యవహరిస్తున్న ఈ చిత్రాన్ని శ్రీకరా స్టూడియోస్ సమర్పిస్తోంది. ఇప్పటికే ఈ చిత్రం నుంచి రిలీజైన పోస్టర్స్, సాంగ్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. ఇక తాజాగా ఈ సినిమా నుంచి రెండో సాంగ్ ను మేకర్స్ రిలీజ్ చేశారు.
డీజే టిల్లుతో రాధిక పేరు ఒక బ్రాండ్ లా మారిపోయింది. అంతగా జనాదరణ పొందిన ‘రాధిక’ పేరుతో వచ్చిన ఈ పాట విశేషంగా ఆకట్టుకుంటోంది.

Sudha Kongara: చిక్కులో సూర్య డైరెక్టర్.. క్షమాపణ చెప్పి తీరాల్సిందే

ఒకసారి వినగానే మళ్ళీ మళ్ళీ వినాలి అనిపించే అంతగా ఈ పాట బాగుంది. ఈ పాట ఖచ్చితంగా ఈ సంవత్సరంలోని టాప్ 10 చార్ట్‌బస్టర్‌లలో ఒకటిగా నిలుస్తుంది అనడంలో సందేహం లేదు. మరోసారి టిల్లు రాధికా వలలో చిక్కుకున్నాడు. అందుకే.. రాధికా పేరును ఒక బ్రాండ్ గా మార్చిసి.. ఆమెలా ఆడుకొనేవారికి రాధికా జాతికి చెందిన ఆడపడుచులు అని చెప్పుకొచ్చాడు. ఇక ఇప్పుడు రాధికా .. తనను ఎలా వశపరుచుకుందో చెప్పుకొచ్చాడు. ఇక ఈ సాంగ్ కు కాసర్ల శ్యామ్ లిరిక్స్ అందించగా.. రామ్ మిరియాల సంగీతం అందించాడు. ప్రస్తుతం ఈ సాంగ్ నెట్టింట వైరల్ గా మారింది. సాంగ్స్ తో ఇప్పటివరకు టిల్లు గాడు మంచి హైప్ తీసుకొచ్చాడు. ఇక సినిమా కూడా మొదటి పార్ట్ లా ఉంటే ఈసారి కూడా హిట్ తప్పకుండ అందుతుందని అభిమానులు చెప్పుకొస్తున్నారు. మరి ఈ సినిమా ఎలాంటి హిట్ ను అందుకుంటుందో చూడాలి.

Exit mobile version