NTV Telugu Site icon

Tillu Square: అప్పుడు నేహా.. ఇప్పుడు అనుపమ.. ముద్దు మాత్రం సిద్దుకే

Dj Tillu

Dj Tillu

Tillu Square: సిద్దు జొన్నలగడ్డ(Siddu Jonnalagadda)ను స్టార్ హీరోగా నిలబెట్టిన సినిమా డీజే టిల్లు( Dj Tillu). విమల్ కృష్ణ(Vimal Krishna) దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా ఇండస్ట్రీని షేక్ చేసింది. సిద్దు బాయ్ ను ఆ రేంజ్ లో నిలబెట్టింది. ఇక తనకు హిట్ ఇచ్చిన అదే సినిమాకు సీక్వెల్ ప్రకటించి ఔరా అనిపించాడు. టిల్లు స్క్వేర్(Tillu Square) పేరుతో ఈ సినిమాను పీడీవీ ప్రసాద్‌ సమర్పణలో సితార ఎంటర్‌టైన్‌మెంట్స్‌(Sithara Entertainments) బ్యాన‌ర్‌పై సూర్యదేవర నాగవంశీ( Sury Devara Nagavamsi) నిర్మిస్తున్నాడు. ఇకపోతే మొదటి పార్ట్ కు విమల్ కృష్ణ దర్శకత్వం వహించగా.. సీక్వెల్ కు మల్లిక్ రామ్( Mallik Ram) దర్శకత్వం వహిస్తున్నాడు. ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ చిత్రంలో సిద్దు సరసన అనుపమ పరమేశ్వరన్( Anupama Parameswaran) నటిస్తోంది. ఇక ఇప్పటికే ఈ సినిమా నుంచి రిలీజైన పోస్టర్స్, వీడియోస్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి.

Adipurush: కటౌట్ చూసి కొన్ని కొన్ని నమ్మేయాలి డ్యూడ్..

తాజాగా ఈ సినిమా రిలీజ్ డేట్ ను మేకర్స్ ప్రకటించారు. అంతేకాకుండా టిల్లు- రాధిక పోస్టర్ ను కూడా రిలీజ్ చేశారు. ఈ సినిమా అనుకున్నప్పటినుంచి హీరోయిన్లు మారుతున్నారని, సిద్ధుతో అనుపమ కు గొడవలు అని ఏవేవి పుకార్లు పుట్టుకొచ్చాయి. కానీ, అవేమి నిజం కాదని సిద్దు బాయ్ క్లారిటీ ఇచ్చాడు. ఇక ఈ సినిమా సెప్టెంబర్ 15( September 15) న రిలీజ్ చేస్తున్నట్లు ప్రకటించారు. ఇక పోస్టర్ లుక్ ఆకట్టుకుంటుంది. గతంలో డీజే టిల్లు పోస్టర్ ఎంత ఇంపాక్ట్ క్రియేట్ చేసిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. కారులో సిద్దు ఒడిలో నేహశెట్టి(Neha Shetty) కూర్చొని ముద్దు పెడుతూ కనిపించింది. ఇక ఇప్పుడు కూడా ఇదే పోస్టర్ ను మేకర్స్ రిలీజ్ చేశారు. కాకపోతే నేహా ప్లేస్ లో అనుపమ ఉంది. ప్రస్తుతం ఈ పోస్టర్ నెట్టింట వైరల్ గా మారింది. ఇందులో అనుపమ కొద్దిగా హద్దుమీరి మరీ అందాల ఆరబోత, లిప్ లాక్స్ కు ఓకే చెప్పిందని టాక్. మరి ఈసారి టిల్లు గాడి ప్రేమ వ్యవహారం.. కొత్త రాధికతో ఎలాంటి చిక్కులు తీసుకొచ్చి పెడుతుందో చూడాలి.

Show comments