Tiger Shroff : టైగర్ ష్రాఫ్ ‘యాక్షన్’ సీక్రెట్ లీక్.. ఆ గాయాల నుంచి కోతల్లేకుండానే ఎలా కోలుకుంటున్నాడంటే?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
బాలీవుడ్ యాక్షన్ స్టార్ టైగర్ ష్రాఫ్ అంటేనే గాల్లోకి ఎగురుతూ చేసే ఒళ్లు గగుర్పొడిచే విన్యాసాలు, కళ్లు చెదిరే మార్షల్ ఆర్ట్స్, కండలు తిరిగిన దేహం గుర్తుకొస్తాయి. అయితే, ప్రాణాలను పణంగా పెట్టి అలాంటి భారీ యాక్షన్ స్టంట్స్ చేస్తున్నప్పుడు తీవ్రమైన గాయాలు కావడం సహజం. మరి ఆ గాయాల నుంచి టైగర్ అంత వేగంగా ఎలా కోలుకుంటున్నాడు? సర్జరీల దాకా వెళ్లకుండా తన శారీరక దృఢత్వాన్ని ఎలా కాపాడుకుంటున్నాడు? ఎవరికీ తెలియని ఈ అసలు రహస్యాన్ని టైగర్ ష్రాఫ్ స్వయంగా బయటపెట్టాడు! తాజాగా ప్రముఖ స్పోర్ట్స్ మెడిసిన్, రీజెనరేటివ్ ఆర్థోపెడిక్స్ నిపుణుడు డాక్టర్ వెంకటేష్ మోవ్వతో టైగర్ ష్రాఫ్ జరిపిన ఒక స్పెషల్ డిస్కషన్ ఇప్పుడు సోషల్ మీడియాలో సెన్సేషన్‌గా మారింది. ఈ పాడ్‌కాస్ట్‌లో తన ఫిట్నెస్ సీక్రెట్‌ను రివీల్ చేసిన టైగర్.. గాయాల నుంచి వేగంగా కోలుకోవడానికి తాను ‘పీఆర్పీ (PRP)’, ‘స్టెమ్ సెల్ థెరపీ (Stem Cell)’ లాంటి అత్యాధునిక రీజెనరేటివ్ చికిత్సలు తీసుకుంటున్నట్లు వెల్లడించాడు. ఇది రెండు వారాల క్రితం వీడియో అయినా తాజా కాల్పుల ఘటన అనంతరం సాధారణంగా ఎముకలు, కండరాలు, కీళ్లకు సంబంధించి తీవ్రమైన గాయాలైతే ఇక ఆపరేషన్ (శస్త్రచికిత్స) తప్పదేమో అని చాలామంది భయపడుతుంటారు. కానీ డాక్టర్ వెంకటేష్ మోవ్వ మాటలను బట్టి చూస్తే.. మోకాలి నొప్పులు, కండరాల కదలికలకు సంబంధించిన ప్రతి సమస్యకూ సర్జరీయే పరిష్కారం కాదు. ప్లేట్లెట్ రిచ్ ప్లాస్మా (PRP) థెరపీ, ఎముక మజ్జ నుంచి సేకరించిన మూలకణాలతో (స్టెమ్ సెల్స్) చేసే అధునాతన రీజెనరేటివ్ వైద్య విధానాలతో కోతల్లేకుండానే గాయాలను నయం చేయొచ్చు. టైగర్ ష్రాఫ్ లాంటి స్టార్లు ఈ చికిత్సల ద్వారానే మళ్లీ తమ పాత బలాన్ని, ఫ్లెక్సిబిలిటీని పుంజుకుంటున్నారు.
కండలు పెంచడం, జిమ్‌లో బరువులు ఎత్తడమే ఫిట్నెస్ అని నేటి యువత భావిస్తోంది. కానీ గాయపడినప్పుడు శరీరం తిరిగి కోలుకునేలా (రికవరీ) చేయడమే అసలైన ఫిట్నెస్ అని ఈ ఇంటర్వ్యూ స్పష్టం చేస్తోంది. ముఖ్యంగా యాక్షన్ హీరోలు, క్రీడాకారులు తమ శరీరంపై పడే ఒత్తిడిని బ్యాలెన్స్ చేసుకుంటూ, సరైన వైద్యుల పర్యవేక్షణలో పునరావాస (రిహాబిలిటేషన్) చికిత్సలు తీసుకోవడం దీర్ఘకాలిక ఫిట్‌నెస్‌కు ఎంతో ముఖ్యం. డాక్టర్ వెంకటేష్ మోవ్వ స్థాపించిన ఈ ‘రీజెన్ ఆర్థో స్పోర్ట్’.. ప్రస్తుతం ఇండియా, అమెరికాలో అడ్వాన్స్డ్ ఆర్థోపెడిక్, రీజెనరేటివ్ వైద్య సేవలను అందిస్తోంది. సర్జరీల అవసరం లేకుండా కీళ్లు, వెన్నెముక, ఎముకల సమస్యలతో బాధపడే వారికి, క్రీడాకారులకు ఈ అత్యాధునిక వైద్యం ఒక వరం లాంటిదని చెప్పొచ్చు. కేవలం బాడీబిల్డింగ్ పైనే కాదు, గాయాల రికవరీపై కూడా అవగాహన పెంచుకోవాలంటూ డాక్టర్ వెంకటేష్ మోవ్వతో తాను చేసిన ఈ ఇంట్రెస్టింగ్ చర్చకు సంబంధించిన వివరాలను టైగర్ ష్రాఫ్ తన ఇన్‌స్టాగ్రామ్‌లో కూడా షేర్ చేశాడు.
Also Read
తాజావార్తలు
-
Tiger Shroff : టైగర్ ష్రాఫ్ ‘యాక్షన్’ సీక్రెట్ లీక్.. ఆ గాయాల నుంచి కోతల్లేకుండానే ఎలా కోలుకుంటున్నాడంటే?
-
Scene: దీపావళి బరిలో సూర్య, ‘ఆవేశం’ డైరెక్టర్ సెన్సేషనల్ ‘సీన్’!
-
LPG Gas Saving Tips: మీ గ్యాస్ సిలిండర్ త్వరగా అయిపోతోందా?.. ఈ చిన్న టిప్స్ పాటిస్తే ఎంతో ఆదా!
-
DK Shivakumar: ‘‘కాంగ్రెస్ వల్లే మోడీ ప్రధాని అయ్యారు’’.. డీకే శివకుమార్ వ్యాఖ్యలు..
-
JoJo : మనోభావాల బ్యాచ్‌కు మరోసారి షాకిచ్చిన ‘జో జో’ టీమ్
ట్రెండింగ్
-
Used Tea Leaves: వాడేసిన టీ పొడిని పారేస్తున్నారా? ఆ చెత్తతో గాజు వస్తువులు మెరిపించవచ్చని తెలుసా?
-
Virat Kohli vs Pakistan: భారత్ – పాక్ సమరం.. జీవితంలో మరిచిపోలేని విరాట్ కోహ్లీ మాస్ ఇన్నింగ్స్..!
-
స్నాప్‌డ్రాగన్ 8 ఎలైట్ జెన్ 5, యాక్టివ్ కూలింగ్ ఫ్యాన్‌తో OnePlus Ace 7 Pro.. అక్టోబర్ 29న గ్రాండ్ ఎంట్రీ..!
-
Yellow Gas Flame: గ్యాస్ మంట పసుపు లేదా నారింజ రంగులో వస్తోందా? ప్రమాదం పొంచి ఉండొచ్చు జాగ్రత్త సుమీ..!
-
Onion Pesarattu: టిఫిన్స్‌లో రారాజు ‘ఆనియన్ పెసరట్టు’.. పర్ఫెక్ట్ కొలతలతో రెస్టారెంట్ స్టైల్లో సులువుగా చేసుకోండి ఇలా..!