NTV Telugu Site icon

Tiger Nageswara Rao: టైగర్ నాగేశ్వరరావు నుంచి క్రేజీ అప్డేట్.. ఆరోజు దద్దరిల్లిపోవాల్సిందే!

Tiger Nageswara Rao First L

Tiger Nageswara Rao First L

Tiger Nageswara Rao First Look To Release On May 24: మన టాలీవుడ్‌లో రూపొందుతోన్న అత్యంత క్రేజీ ప్రాజెక్టుల్లో ‘టైగర్ నాగేశ్వరరావు’ ఒకటి. స్టూవర్టుపురంలో పేరుమోసిన దొంగ టైగర్ నాగేశ్వరరావు జీవితం ఆధారంగా ఈ సినిమా రూపొందుతోంది. ఈ సబ్జెక్టే చాలా ఆసక్తికరమైనది కావడం, ఇప్పటికే విడుదలైన ప్రీ-లుక్స్ క్రేజీగా ఉండటంతో.. ఈ సినిమాపై ప్రేక్షకుల్లో తారాస్థాయి అంచనాలు నెలకొన్నాయి. అందుకే, ఈ సినిమా అప్డేట్స్ కోసం ఆడియెన్స్ వేచి చూస్తున్నారు. ఈ సినిమా అనౌన్స్‌మెంట్ వచ్చి చాలా రోజులు అవుతున్నా, ఇప్పటివరకూ ఫస్ట్ లుక్ రిలీజ్ అవ్వలేదు. దీంతో.. ఫస్ట్ లుక్ ఎప్పుడెప్పుడు వస్తుందా? ఇందులో రవితేజ లుక్‌ని ఎప్పుడెప్పుడు చూస్తామా? అని ఫ్యాన్స్ వెయిట్ చేస్తున్నారు. అయితే.. ఇప్పుడు ఎంతోకాలం వెయిట్ చేయాల్సిన అవసరం లేదు. ఎందుకంటే.. ఆ నిరీక్షణకు కళ్లెం వేసే సమయం ఆసన్నమైంది. ఈ సినిమా ఫస్ట్ లుక్‌ని ఎప్పుడు రిలీజ్ చేయబోతున్నారన్న విషయాన్ని చిత్రబృందం అధికారికంగా వెల్లడించింది. మే 24వ తేదీన ఫస్ట్ లుక్ రిలీజ్ చేయనున్నామని, ఇందులో మునుపెన్నడూ చూడని సరికొత్త అవతారంలో రవితేజని చూడబోతున్నారని మేకర్స్ ప్రకటించారు.

Forest Area: అత్యధిక అటవీ ప్రాంతం గల టాప్-10 దేశాలు

కాగా.. ఈ సినిమాను తెలుగు, తమిళం, హిందీ, మలయాళం, కన్నడ భాషల్లో పాన్ ఇండియా ప్రాజెక్ట్‌గా రిలీజ్ చేస్తున్నారు. ఇందులో రవితేజ సరసన నుపుర్ సనన్, గాయత్రి భరద్వాజ్ కథానాయికలుగా నటిస్తున్నారు. అంతేకాదు.. రేణు దేశాయ్, అనుపమ్ ఖేర్, జిషూ సేన్‌గుప్తా వంటి ప్రముఖ నటీనటులు నటిస్తున్నారు. జీవీ ప్రకాశ్ సంగీతం సమకూరుస్తున్న ఈ సినిమాను అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ బ్యానర్‌పై అభిషేక్ అగర్వాల్ నిర్మిస్తున్నారు. తేజ్ అగర్వాల్ ఈ సినిమాను సమర్పిస్తున్నారు. ఇది పాన్ ఇండియా ప్రాజెక్ట్ కావడంతో.. ఈ సినిమాను రవితేజ ప్రతిష్టాత్మకంగా తీసుకొని, ఎంతో శ్రద్ధతో వర్క్ చేస్తున్నాడు. ఈ సినిమాను అక్టోబర్ 23వ తేదీన భారీఎత్తున విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు.