NTV Telugu Site icon

Tiger Shroff: దిశాతో బ్రేకప్ తర్వాత మళ్ళీ ‘దిశా ప్రేమలో టైగర్

Deesha

Deesha

Tiger dating Deesha Dhanuka after Disha Patani: దిశా పటానీ -టైగర్ ష్రాఫ్ మంచి జోడీగా ఉండేవారు, నిరంతరం వారి రిలేషన్ గురించే అనేక వార్తలు తెర మీదకు వస్తూ ఉండేవి. అయితే ఈ మధ్యనే వీరు బ్రేకప్ చెప్పుకున్నారు. ఇద్దరూ ఈ విషయాన్ని బహిరంగంగా అంగీకరించనప్పటికీ ఇప్పుడు బ్రేకప్ అయిన ఏడాది తర్వాత, టైగర్ లైఫ్లోకి మరో దిశా వచ్చింది. అయితే ఆమె దిశా పటాని కాదు దిశా ధనుక. అవును నిజమే టైగర్ ష్రాఫ్ ఇప్పుడు దిశా ధనుక అనే యువతితో డేటింగ్ చేస్తున్నట్లు వార్తలు వచ్చాయి. ఇప్పుడు టైగర్ ష్రాఫ్ కూడా దీనిపై తన మౌనాన్ని వీడి దిశాతో డేటింగ్ గురించి స్పందించాడు. దిషా ధనుక తన ఫిట్‌నెస్‌ను చూసుకుంటుందని చెప్పుకొచ్చాడు. బాంబే టైమ్స్ నివేదిక ప్రకారం, టైగర్ ష్రాఫ్ దిశా ధనుకతో డేటింగ్ చేస్తున్నాడు.

Bhola Shankar: భోళా శంకర్ సినిమా నిలిపివేత.. థియేటర్ సీజ్

ఎంటర్‌టైన్‌మెంట్ ప్రొడక్షన్ హౌస్‌లో ఆమె చాలా మంచి ప్లేస్ లో ఉందని, టైగర్‌కి సరైన స్క్రిప్ట్‌లను ఎంచుకోవడంలో తరచుగా సహాయపడుతుందని చెబుతున్నారు. పటాని తన నుండి విడిపోయిన తర్వాత టైగర్ దిశాతో డేటింగ్ ప్రారంభించినట్లు సమాచారం. వారు దాదాపు ఒకటిన్నర సంవత్సరాలుగా డేట్ చేసుకుంటున్నారని, దిశా తరచుగా టైగర్ కి స్క్రిప్ట్ గురించి సలహాలు ఇస్తూ ఉంటుందని, అలాగే ఆమె అతని ఫిట్‌నెస్‌ను కూడా చూసుకుందని అంటున్నారు. దీనిపై టైగర్ ష్రాఫ్‌ను ప్రశ్నించగా, తాను సింగిల్‌గా ఉన్నానని టైగర్ ష్రాఫ్ చెప్పాడు. ఇ టైమ్స్‌తో జరిగిన సంభాషణలో, టైగర్ మాట్లాడుతూ ‘కొన్ని నెలల క్రితం నాకు వేరొకరితో సంబంధం ఉందని నేను అనుకున్నాను, కానీ అది లేదు, నేను గత రెండేళ్లుగా ఒంటరిగా ఉన్నానని ఆయన అన్నారు. ఇదిలా ఉంటే, దిశా పటానీ తన జిమ్ పార్ట్నర్ తో డేటింగ్ చేస్తున్నట్టు వార్తలు వస్తున్నాయి. ఆమె న స్నేహితుడిని అలెగ్జాండర్‌కు తన బాయ్‌ఫ్రెండ్‌గా పరిచయం చేస్తున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది.