NTV Telugu Site icon

Tiger 3 Ticket Sales: ‘జవాన్’ అడ్వాన్స్ టికెట్ బుకింగ్ రికార్డు బద్దలు కొట్టిన ‘టైగర్ 3’

Tiger 3 Jawan

Tiger 3 Jawan

Tiger 3 Advance Booking Ticket Sales Create New Record:‘కిసీ కా భాయ్ కిసీ కా జాన్’ సినిమా తర్వాత మళ్లీ సల్మాన్ ఖాన్ ‘టైగర్ 3’తో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్దమయ్యాడు. ఇప్పటివరకు విడుదలైన హిందీ సినిమాల హిస్టరీలో అడ్వాన్స్ బుకింగ్ సమయంలోనే టిక్కెట్లు అమ్ముడై సరికొత్త రికార్డు సృష్టించింది. దేశంలో ఇప్పటివరకు విడుదలైన హిందీ చిత్రాలన్నింటిలో అత్యధిక అడ్వాన్స్ బుకింగ్ టిక్కెట్లను విక్రయించిన చిత్రంగా ‘జవాన్’ రికార్డును కూడా ఈ టైగర్ 3 బద్దలు కొట్టింది. నవంబర్ 12న దీపావళి కానుకగా విడుదలవుతున్న ‘టైగర్ 3’ చిత్రం తెలుగు, తమిళ భాషల్లో కూడా విడుదలవుతుండగా, ఆ బాషల అడ్వాన్స్ బుకింగ్ టిక్కెట్ల అమ్మకాలు కూడా బానే ఉన్నాయి. శనివారం సాయంత్రం వరకు అందిన సమాచారం ప్రకారం, యశ్ రాజ్ ఫిల్మ్స్ ‘టైగర్ 3’ అడ్వాన్స్ బుకింగ్‌లో ఇప్పటివరకు 6 లక్షల 24 వేలకు పైగా టిక్కెట్లు థియేటర్లలో అమ్ముడయ్యాయి. నిజానికి ఒక హిందీ సినిమా విడుదలకు ముందు అడ్వాన్స్ బుకింగ్‌లో అమ్ముడైన టిక్కెట్‌లలో ఇదే అత్యధికం. ఇంతకుముందు, ఈ రికార్డు షారుక్ ఖాన్, దీపికా పదుకొనే, జాన్ అబ్రహంల సినిమా ‘పఠాన్’ పేరిట ఉంది. ఈ సినిమా నేషనల్ చైన్‌ల థియేటర్లలో ముందస్తు బుకింగ్‌లో 5.57 లక్షల టిక్కెట్లు అమ్ముడయ్యాయి.

Meenakshi Chaudhary: గురూజీ సెంటిమెంట్ రిపీట్ చేస్తున్నాడే?

‘టైగర్ 3’ సినిమా కంటే ముందుగానే టిక్కెట్ల విక్రయాల ముందస్తు బుకింగ్‌లో, ఇప్పుడు ‘బాహుబలి 2’ చిత్రం మాత్రమే విడుదలకు ముందే 6.50 లక్షల టిక్కెట్లు అమ్ముడైంది. శుక్రవారం రాత్రి నుంచి ‘టైగర్ 3’ సినిమా అడ్వాన్స్ బుకింగ్ ఊపందుకోగా, టిక్కెట్ల విక్రయాల ఆదాయం కలిపితే దాదాపు రూ.17 కోట్లకు చేరుకుంది. ఈ సినిమా విడుదలైన మొదటి రోజే భారీ ఓపెనింగ్స్ సాధించడంతోపాటు దీపావళికి విడుదలయ్యే సినిమాల ఓపెనింగ్స్‌లో సరికొత్త రికార్డును సృష్టించగలదనే నమ్మకంతో ఉన్నారు మేకర్స్. ఈ సినిమా ఓపెనింగ్ 40- 50 కోట్ల వరకు ఉంటుందని అంచనా వేస్తున్నారు. ఓపెనింగ్ డే లెక్కలను పరిశీలిస్తే, దేశంలో ఇప్పటి వరకు హిందీలో విడుదలైన చిత్రాలలో మొదటి రోజు వసూళ్ల రికార్డు ఇప్పుడు ‘జవాన్’ సినిమా ఉంది, ఆ రోజు విడుదలై రూ.75 కోట్ల గ్రాండ్ ఓపెనింగ్స్ సాధించింది. ‘టైగర్ 3’ సినిమా అడ్వాన్స్ బుకింగ్ లో జరిగిన టిక్కెట్ సేల్స్ చూస్తుంటే ఈ సినిమా విడుదలైన మొదటి రోజే బెస్ట్ దీపావళి ఓపెనర్ గా రికార్డు సృష్టించడం ఖాయం అని అంటున్నారు.