Tiger 3 Ticket Sales: ‘జవాన్’ అడ్వాన్స్ టికెట్ బుకింగ్ రికార్డు బద్దలు కొట్టిన ‘టైగర్ 3’
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Tiger 3 Advance Booking Ticket Sales Create New Record:‘కిసీ కా భాయ్ కిసీ కా జాన్’ సినిమా తర్వాత మళ్లీ సల్మాన్ ఖాన్ ‘టైగర్ 3’తో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్దమయ్యాడు. ఇప్పటివరకు విడుదలైన హిందీ సినిమాల హిస్టరీలో అడ్వాన్స్ బుకింగ్ సమయంలోనే టిక్కెట్లు అమ్ముడై సరికొత్త రికార్డు సృష్టించింది. దేశంలో ఇప్పటివరకు విడుదలైన హిందీ చిత్రాలన్నింటిలో అత్యధిక అడ్వాన్స్ బుకింగ్ టిక్కెట్లను విక్రయించిన చిత్రంగా ‘జవాన్’ రికార్డును కూడా ఈ టైగర్ 3 బద్దలు కొట్టింది. నవంబర్ 12న దీపావళి కానుకగా విడుదలవుతున్న ‘టైగర్ 3’ చిత్రం తెలుగు, తమిళ భాషల్లో కూడా విడుదలవుతుండగా, ఆ బాషల అడ్వాన్స్ బుకింగ్ టిక్కెట్ల అమ్మకాలు కూడా బానే ఉన్నాయి. శనివారం సాయంత్రం వరకు అందిన సమాచారం ప్రకారం, యశ్ రాజ్ ఫిల్మ్స్ ‘టైగర్ 3’ అడ్వాన్స్ బుకింగ్‌లో ఇప్పటివరకు 6 లక్షల 24 వేలకు పైగా టిక్కెట్లు థియేటర్లలో అమ్ముడయ్యాయి. నిజానికి ఒక హిందీ సినిమా విడుదలకు ముందు అడ్వాన్స్ బుకింగ్‌లో అమ్ముడైన టిక్కెట్‌లలో ఇదే అత్యధికం. ఇంతకుముందు, ఈ రికార్డు షారుక్ ఖాన్, దీపికా పదుకొనే, జాన్ అబ్రహంల సినిమా ‘పఠాన్’ పేరిట ఉంది. ఈ సినిమా నేషనల్ చైన్‌ల థియేటర్లలో ముందస్తు బుకింగ్‌లో 5.57 లక్షల టిక్కెట్లు అమ్ముడయ్యాయి.
Meenakshi Chaudhary: గురూజీ సెంటిమెంట్ రిపీట్ చేస్తున్నాడే?
Also Read
- Kona Venkat : హీరోలు భారీ బడ్జెట్ సినిమాల మోజులో పడి కాలం వృధా చేస్తున్నారు
- Vijay Deverakonda :3 -4 నెలల పాటు రాయలసీమ మాండలికంపై సాధన చేశా
- Vijay Deverakonda: "బ్రిటిషర్లు రైల్వేలు వేసింది మన కోసం కాదు.. దేశాన్ని దోచుకోవడానికే!".. దేవరకొండ సంచలన వ్యాఖ్యలు
- Tollywood Movie Releases: కుర్రళ్లోయ్.. కుర్రాళ్లు..! బాక్సాఫీస్ వద్ద యంగ్ హీరోల దండయాత్ర..
‘టైగర్ 3’ సినిమా కంటే ముందుగానే టిక్కెట్ల విక్రయాల ముందస్తు బుకింగ్‌లో, ఇప్పుడు ‘బాహుబలి 2’ చిత్రం మాత్రమే విడుదలకు ముందే 6.50 లక్షల టిక్కెట్లు అమ్ముడైంది. శుక్రవారం రాత్రి నుంచి ‘టైగర్ 3’ సినిమా అడ్వాన్స్ బుకింగ్ ఊపందుకోగా, టిక్కెట్ల విక్రయాల ఆదాయం కలిపితే దాదాపు రూ.17 కోట్లకు చేరుకుంది. ఈ సినిమా విడుదలైన మొదటి రోజే భారీ ఓపెనింగ్స్ సాధించడంతోపాటు దీపావళికి విడుదలయ్యే సినిమాల ఓపెనింగ్స్‌లో సరికొత్త రికార్డును సృష్టించగలదనే నమ్మకంతో ఉన్నారు మేకర్స్. ఈ సినిమా ఓపెనింగ్ 40- 50 కోట్ల వరకు ఉంటుందని అంచనా వేస్తున్నారు. ఓపెనింగ్ డే లెక్కలను పరిశీలిస్తే, దేశంలో ఇప్పటి వరకు హిందీలో విడుదలైన చిత్రాలలో మొదటి రోజు వసూళ్ల రికార్డు ఇప్పుడు ‘జవాన్’ సినిమా ఉంది, ఆ రోజు విడుదలై రూ.75 కోట్ల గ్రాండ్ ఓపెనింగ్స్ సాధించింది. ‘టైగర్ 3’ సినిమా అడ్వాన్స్ బుకింగ్ లో జరిగిన టిక్కెట్ సేల్స్ చూస్తుంటే ఈ సినిమా విడుదలైన మొదటి రోజే బెస్ట్ దీపావళి ఓపెనర్ గా రికార్డు సృష్టించడం ఖాయం అని అంటున్నారు.
తాజావార్తలు
-
Yogi Adityanath: ‘‘ఇద్దరం పోటీ చేద్దాం, అదృష్టాన్ని పరీక్షించుకుందాం’’.. అఖిలేష్‌కు యోగి సవాల్..
-
AP Govt: NTR వైద్య సేవలో అక్రమాలపై వేటు.. 203 ఆసుపత్రులకు రూ.34.39 కోట్ల జరిమానా..
-
Rekha Gupta: ఢిల్లీని బందీగా మార్చనివ్వం.. విపక్షాల కుట్రను తిప్పికొడతామన్న రేఖా గుప్తా
-
Virender Sehwag: ‘ఫస్ట్ బంతి నుంచే సిక్సర్లు’.. సూర్యవంశీకి సెహ్వాగ్ కీలక సూచనలు..
-
CM Revanth Reddy: ఎల్‌నినోతో పొంచి ఉన్న సంక్షోభం.. గ్రామస్థాయి నుంచి ప్రజలను అప్రమత్తం చేయాలి..
ట్రెండింగ్
-
Shai Hope: నా దగ్గర ఆ బ్యాట్స్ ఉన్నాయి.. అందుకే బంతి బౌండరీలు దాటుతోంది.. విండీస్ కెప్టెన్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
3D ఎఫెక్ట్‌తో మెకానికల్ లుక్.. లిక్విడ్ కూలింగ్ సిస్టమ్‌తో భారత్‌లోకి Infinix GT 50 Pro..!
-
కొత్త అల్లాయ్ వీల్స్, అప్డేటెడ్ లుక్ తో Toyota Fortuner 2026 Leader ఎడిషన్ లాంచ్.. ధర ఎంతంటే.?
-
IND vs WI: 249 పరుగులు చేసినా ఓటమి తప్పలేదు.. భారత్ కొంపముంచిన 5 కారణాలు ఇవే!
-
Hair Combs Cleaning: ₹1 ఖర్చుతో దువ్వెనలను ఇలా క్లీన్ చేయండి.. మీ జుట్టుకు చేరే మురికి, బ్యాక్టీరియా మాయం.!