NTV Telugu Site icon

Robin Hood : ఏపీలో టికెట్ ధరలు పెంపు.. ఇప్పుడు అవసరమా..?

Robin Hood

Robin Hood

నితిన్ హీరోగా వెంకీ కుడుముల దర్శకత్వంలో వస్తున్న చిత్రం రాబిన్ హుడ్. యంగ్ బ్యూటీ శ్రీలీల హీరోయిన్ గా నటిస్తోంది. ప్రముఖ క్రికెటర్ డేవిడ్ వార్నర్ గెస్ట్ రోల్ లో నటిస్తున్నాడు. గత కోనేళ్ళుగా నితిన్ హిట్ లేక సతమవుతున్నాడు. ఈ సారి ఎలాగైనా హిట్ కొట్టాలని తనకు భీష్మ వంటి బ్లాక్ బస్టర్ ఇచ్చిన వెంకీ కుడుములు నమ్ముకున్నాడు. మార్చి 28న వరల్డ్ వైడ్ గా రిలీజ్ కాబోతున్న రాబిన్ హుడ్ పై నితిన్ చాలా ఆశలు పెట్టుకున్నాడు.

Also Read : Betting App Case : బెట్టింగ్ యాప్స్ కేసులో విచారణ వేగవంతం..

భారీ బడ్జెట్ పై తెరకెక్కిన ఈ సినిమాకు ఆంద్రప్రదేశ్ ప్రభుత్వం గుడ్ న్యూస్ అందించింది. రాబిన్ హుడ్ కు ఏపీ లో టికెట్ ధరలు పెంచుకునేందుకు అనుమతులు ఇచ్చింది. సింగిల్ స్క్రీన్స్ లో రూ. 50 అలాగే మల్టీప్లెక్స్ లో రూ. 75 మొదటి 7 రోజుల పాటు పెంచుకునేందుకు అనుమతులు ఇచ్చింది. కానీ ఈ పెంపు ఇప్పుడు అవసరమా అనే అభిప్రాయూలు వ్యక్తమవుతున్నాయి. హీరోల డేట్స్ కోసం వారికి కోట్లకి కోట్లు రెమ్యునరేషన్స్ ఇచ్చి బడ్జెట్ లు పెంచేసి ఇప్పడు మేము ఎక్కువ ఖర్చు చేసాం టికెట్ ధరలు పెంచండని ప్రభుత్వ అధికారులు చుట్టూ ప్రదక్షిణాలు చేసి అనుమతులు తెచ్చుకుని సామాన్య ప్రజలపై ఆ భారాన్ని మోపడం ఎంతవరకు సమంజసం అనే కామెంట్స్ విన్పిస్తున్నాయి. ఉగాదికి ఫ్యామిలీ ఆడియెన్స్ వస్తారు టికెట్ ధరలు పెంచి వారి నుండి అధిక మొత్తంలో వసూలు చేయాలని సదరు నిర్మాతలు బావిస్తున్నారు. ఇప్పటికే  ప్రేక్షకులు థియేటర్ కు రావడం తగ్గించారు ఇలా ప్రతి సినిమాకు అధిక టికెట్ రేట్స్ ఇస్తూ పొతే వచ్చే పదిమంది కూడా ఇక నుండి రారని ట్రేడ్ పండితుల అభిప్రాయం.