Site icon NTV Telugu

Thugs Movie: దర్శకధీరుడు రాజమౌళి మెచ్చిన యాక్షన్ ఫిల్మ్ ‘థగ్స్’ క్యారక్టర్ ఇంట్రడక్షన్ వీడియో

Thugs Movie

Thugs Movie

Thugs Movie: ప్రముఖ డ్యాన్స్ మాస్టర్ బృంద గోపాల్ డైరెక్షన్‌లో.. పులి, ఇంకొకడు, సామి 2, పలు హిందీ చిత్రాలను నిర్మించిన ప్రొడ్యూసర్, 130కి పైగా సినిమాలు పంపిణీ చేసిన టాప్ డిస్ట్రిబ్యూటర్ షిబు తమీన్స్ కుమార్తె రియా షిబు హెచ్‌ఆర్ పిక్చర్స్ బ్యానర్‌పై పాన్ ఇండియా చిత్రంగా నిర్మిస్తున్న చిత్రం ‘థగ్స్’. ఇంటెన్స్ యాక్షన్‌ ఫిల్మ్‌గా తెరకెక్కుతున్న ఈ సినిమా ద్వారా షిబు కుమారుడు హృదు హరూన్ హీరోగా పరిచయం అవుతుండగా.. సింహ, ఆర్‌కే సురేష్, మునిష్కాంత్, అనస్వర రాజన్‌ ఇతర ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. శామ్ సీఎస్ సంగీతాన్ని అందిస్తుండగా.. ప్రియేష్ గురుస్వామి సినిమాటోగ్రాఫర్‌గా పనిచేస్తున్నారు. ప్రవీణ్ ఆంటోనీ ఎడిటర్‌గా, జోసెఫ్ నెల్లికల్ ప్రొడక్షన్ డిజైనర్‌గా ఈ ”థగ్స్” చిత్రం రూపొందుతోంది.

‘థగ్స్’ చిత్రానికి సంబంధించిన క్యారక్టర్ ఇంట్రడక్షన్ వీడియోను చెన్నైలో భారీ వేడుకలో విడుదల చేశారు. ఆర్య, భాగ్యరాజ్, గౌతమ్ మీనన్, పార్థిబన్, ఖుష్బూ, దేసింగ్, పూర్ణిమ భాగ్యరాజ్, కళామాస్టర్ వంటి ప్రముఖుల సమక్షంలో ఈ వీడియోను విడుదల చేశారు. ఈ వేడుకకు హాజరైన వారందరూ ”థగ్స్” సినిమా భారీ విజయం సాధించాలని ఆకాంక్షించారు. ‘క్యారక్టర్‌ ఫ్రమ్ ద వరల్డ్ ఆఫ్ థగ్స్‌’గా విడుదల అయిన ఈ వీడియోలో చిత్రంలోని ప్రధాన పాత్రలను పరిచయం చేశారు.‘మాస్టర్ మైండ్’ సేతుగా హృదు, ‘రోగ్’ దురైగా సింహ, ‘బ్రూట్’ ఆరాకియా దాస్‌గా ఆర్‌కే సురేష్, ‘క్రుకెడ్’ మరుదుగా మునిష్కాంత్ కనిపించిన ఈ వీడియో సినిమా మీద అంచనాలను పెంచే విధంగా ఉంది. వీడియో ఆద్యంతం శామ్ సీఎస్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ మూడ్‌ను ఎలివేట్ చేసేలా సాగింది. ఇందులో కనిపించిన యాక్షన్‌ సన్నివేశాలను బట్టి చూస్తే ఆద్యంతం ఉత్కంఠభరితంగా సాగేలా చిత్రమని అర్థమవుతోంది. దర్శకధీరుడు ఎస్‌ఎస్‌ రాజమౌళి వీడియో బైట్‌లో హీరో మృదుకు తన బెస్ట్ విషెస్ చెప్పారు. థగ్స్ చిత్రం విడుదలయ్యే అన్ని భాషల్లో విజయం సాధించాలని కోరుకుంటున్నట్లు రాజమౌళి వెల్లడించారు. నవంబర్‌లో థియేటర్లలో తమిళ్, తెలుగు, కన్నడ, హిందీ భాషల్లో ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది.

Ponniyin Selvan: I : మణిరత్నంపై హృతిక్, ధనుష్ దాడి

గ్రాండ్‌గా జరిగిన ఈవెంట్‌లో పలువురు ప్రముఖులు మాట్లాడారు. ఈ సినిమా భారీ విజయం సాధించాలని ఆకాంక్షించారు. నటుడు ఆర్య మాట్లాడుతూ.. ”బృందా మాస్టర్‌తో కలిసి చాలా సినిమాల్లో పనిచేశాను. ఆమె నిజ స్వభావం ఎల్లప్పుడూ యాక్షన్‌తో కూడి ఉంటుంది. అది ఈ చిత్రంలో ప్రతిబింబిస్తుంది. ఈ సినిమాలో పవర్‌ఫుల్ యాక్షన్ సీక్వెన్స్‌లు ఉన్నాయని, అది సినిమా టీజర్‌లో స్పష్టంగా కనిపిస్తోంది. నిర్మాత షిబు థమీన్స్ తాను చేసే ప్రతి పనిలో ఎప్పుడూ ప్రత్యేకతను ఆశిస్తారని, ‘థగ్స్’ ఆయన అంచనాలను తప్పకుండా నెరవేరుస్తుందనే నమ్మకం ఉంది. సినిమా రాక కోసం నేను ఆసక్తిగా ఎదురు చూస్తున్నాను. ఈ చిత్రం మంచి విజయం సాధించాలని కోరుకుంటున్నాను.”

దర్శకుడు గౌతమ్ వాసుదేవ్ మీనన్ మాట్లాడుతూ.. ”బృందా రాక్షసి. నా సినిమాల్లో పాటలన్నీ బాగా రావడానికి ఆమె కూడా ఒక కారణం. ‘వేటయ్యాడు విళయ్యాడు’లోని ‘కర్క కర్క’ పాటలో యాక్షన్ షాట్‌లకు కొరియోగ్రఫీ చేసింది ఆమె. ఆమె ఓ యాక్షన్ చిత్రానికి దర్శకత్వం వహించబోతోందని వారు చెప్పినప్పుడు నేను ఆశ్చర్యపోనవసరం లేదు. ఈ సినిమాతో ఆమె కచ్చితంగా ఉన్నత స్థాయికి చేరుకుంటుంది. అమెజాన్ ప్రైమ్ వీడియో వెబ్ సిరీస్ ‘క్రాష్ కోర్స్’లో హృదు హరూన్ అద్భుతమైన నటనతో నన్ను ఆకట్టుకున్నాడు. థగ్స్‌లో కూడా అతని అద్భుతమైన నటనను చూడాలని నేను నిజంగా ఎదురు చూస్తున్నాను. . టీమ్ మొత్తానికి ఈ సినిమా విజయం సాధించాలని కోరుకుంటున్నాను.”

 

Exit mobile version