Site icon NTV Telugu

Thuglife : ఒక్క క్షమాపణ విలువ రూ.12 కోట్లు.. కమల్ కఠిన నిర్ణయం..

Thuglife

Thuglife

Thuglife : అవును.. ఒక్క క్షమాపణ విలువ రూ.12 కోట్లు. కన్నడ భాషపై చేసిన వివాదాస్పద కామెంట్ల విషయంలో కమల్ హాసన్ అస్సలు తగ్గట్లేదు. కన్నడ ఇండస్ట్రీ మొత్తం వ్యరేకించినా సరే తన నిర్ణయం మార్చుకోవట్లేదు. హైకోర్టు సీరియస్ అయినా వెనకడుగు వేయట్లేదు. తన వ్యాఖ్యలనే తప్పుగా అర్థం చేసుకున్నారని అంటున్నాడే తప్ప.. ఒక్క క్షమాపణ చెప్పేందుకు ఒప్పుకోవట్లేదు. కోర్టు అడిగినా సరే తగ్గకపోవడం ఆశ్చర్యంగా అనిపిస్తోంది. అవసరం అయితే తన సినిమాను కర్ణాటకలో రిలీజ్ చేయను అంటూ నిర్ణయం తీసుకున్నాడు.

Read Also : Surekha Vani : పొట్టిబట్టలు వేసుకోవడంపై సురేఖ వాణి షాకింగ్ కామెంట్స్..

కమల్ హాసన్ క్షమాపణలు చెప్పకపోతే థగ్ లైఫ్ మూవీని కర్ణాటకలో రిలీజ్ కాకుండా అడ్డుకుంటాం అని కన్నడ ఫిల్మ్ ఛాంబర్ తేల్చి చెప్పేసింది. థగ్ లైఫ్ మూవీని బ్యాన్ చేయాలంటూ కర్ణాటక హైకోర్టులో పిటిషన్ కూడా వేసింది ఛాంబర్. దీంతో కోర్టు క్షమాపణ చెబితే అయిపోతుంది కదా అని సూచించినా కమల్ మాత్రం చెప్పకపోగా.. తన సినిమాను కన్నడలో రిలీజ్ చేయను అని నిర్ణయం తీసుకున్నారు. ఈ నిర్ణయంతో థగ్ లైఫ్‌ మూవీకి ఎంత లేదన్నా రూ.12.15 కోట్ల రెవెన్యూ నష్టం వాటిల్లుతంది.

కన్నడ ఇండస్ట్రీలో కమల్ హాసన్ కు మంచి ఫ్యాన్ బేస్ ఉంది. కన్నడ అంటే చాలా పెద్ద మార్కెట్. తమిళ్, తెలుగు తర్వాత కన్నడలో మంచి కలెక్షన్లు వస్తాయి. ఇప్పుడు ఆ అవకాశం లేకపోవడంతో నిర్మాతగా కమల్ హాసన్ కు కూడా నష్టమే. ఆ విషయం తెలిసి కూడా కమల్ వెనక్కు తగ్గట్లేదు. వేరే భాషల్లో రిలీజ్ అయిన తర్వాత కన్నడలో లేట్ గా రిలీజ్ చేస్తే పెద్దగా రెస్పాన్స్ ఉండదు. మరి కమల్ నిర్ణయం ఎంత వరకు వెళ్తుందో చూడాలి.

Read Also : Adavi Shesh : అడివి శేష్ ‘డకాయిట్’ నుంచి ఫైర్ థీమ్ రిలీజ్

Exit mobile version