తెలుగు ఓటీటీ సంస్థ ఆహా కోసం మారుతీ ‘త్రీ రోజెస్’ పేరుతో ఓ వెబ్ సీరిస్ చేస్తున్న విషయం తెలిసిందే. ఇటీవల ఆహా 2.0 కార్యక్రమంలో దాని టీజర్ ను ప్రసారం చేశారు. అయితే ఇప్పుడు దాన్ని అధికారికంగా ఆహా సంస్థ విడుదల చేసింది. ‘భలే భలే మగాడివోయ్, ప్రతిరోజూ పండగే, మహానుభావుడు’ వంటి విజయవంతమైన చిత్రాలను తెరకెక్కించిన దర్శకుడు మారుతి ఈ సిరీస్‌కు షో రన్నర్‌గా వ్యవహరిస్తున్నారు. ఇందులో టైటిల్ రోల్ ను పూర్ణ, ఇషారెబ్బ, పాయల్ రాజ్ పుత్ పోషిస్తున్నారు. డిజిటల్ మాధ్యమంలో ముగ్గురు హీరోయిన్స్ నటిస్తోన్న తొలి వెబ్ సిరీస్ ఇదే. రవి నంబూరి రాసిన ఈ సిరీస్‌ను మ్యాగీ డైరెక్ట్ చేశారు. విజయ్ దేవకొండతో ‘ట్యాక్సీవాలా’ చిత్రాన్ని నిర్మించిన ఎస్.కె.ఎన్. యాక్షన్ కట్ మూవీస్ ఎల్ఎల్‌పి బ్యానర్‌పై ‘3 రోజెస్’ వెబ్ సీరిస్ ని నిర్మిస్తున్నారు. బాల్‌రెడ్డి సినిమాటోగ్రఫీని అందిస్తున్న ఈ వెబ్ సీరిస్ కు ఎస్.బి.ఉద్ధవ్ ఎడిటర్. ‘ఉయ్యాలా జంపాల’ ఫేమ్ ఎం.ఆర్. సన్ని సంగీతాన్ని అందిస్తున్నారు. నవంబర్ 12న ఆహాలో స్ట్రీమింగ్ కాబోతున్న ఈ వెబ్ సీరిస్ టీజర్ ను అందాల నాయిక నిధి అగర్వాల్ సోషల్ మీడియా ద్వారా విడుదల చేసింది.
‘త్రీ రోజెస్’ స్ట్రీమింగ్ డేట్ కన్ఫామ్!
