ఈ మధ్య పాత టైటిల్‌తో కొత్త సినిమాలు రావడం కొత్తేం కాదు. ఇప్పటికే చాలా సినిమాలు పాత టైటిల్‌తో కొత్తగా వచ్చాయి. రీసెంట్‌గా పవన్ కళ్యాణ్ బ్లాక్ బస్టర్ మూవీ ‘ఖుషి’ టైటిల్‌తో విజయ్ దేవరకొండ ఓ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఖుషి సినిమా వచ్చి రెందు దశాబ్దాలు దాటిపోయింది.. కాబట్టి నో ప్రాబ్లమ్. కానీ ఇప్పుడు ముగ్గురు హీరోలు ఒకే టైంలో.. ఒకే టైటిల్‌తో రాబోతున్నారు. కాకపోతే వాటికి ముందు, వెనక ఒక చిన్న తోకను యాడ్ చేస్తున్నారు. మాస్ మహారాజా రవితేజ ఫస్ట్ టైం టైగర్ నాగేశ్వరరావు అనే పాన్ ఇండియా ప్రాజెక్ట్ చేస్తున్నాడు. ప్రస్తుతం ఈ సినిమా సెట్స్ పై ఉంది. అలాగే మంచు విష్ణు కూడా గాలి నాగేశ్వరరావు అనే సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా కూడా శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది. ఇక ఇప్పుడు అక్కినేని నాగ చైతన్య కూడా నాగేశ్వరరావుగా రాబోతున్నట్టుగా తెలుస్తోంది.
రీసెంట్‌గా సర్కారు వారి పాటతో బ్లాక్ బస్టర్ అందుకున్న డైరెక్టర్ పరుశురాం.. తన నెక్ట్స్ సినిమా నాగచైతన్యతో చేయబోతున్నారు. 14 రీల్స్ బ్యానర్ పై ఈ సినిమాను నిర్మించనున్నారు. వాస్తవానికి ‘సర్కారు వారి పాట’ కంటే ముందుగానే.. ఈ సినిమా రావాల్సింది. కానీ మహేష్ బాబుతో ఛాన్స్ రావడంతో.. చైతూ ప్రాజెక్ట్‌ను హోల్డ్‌లో పెట్టాడు పరశురామ్. దాంతో ఇప్పుడు చైతు సినిమా మొదలు పెట్టబోతున్నారు. ఈ సినిమాకి ‘నాగేశ్వరరావు’ అనే టైటిల్ ఫిక్స్ చేసినట్టు సమాచారం. ఇలా ఒకే టైటిల్‌లో రవితేజ, విష్ణు, చైతూ.. ఒకేసారి రాబోతుండడం విశేషంగా మారింది. అయితే వీరిలో.. నాగేశ్వరరావు మనవడిగా చైతూకు ఈ టైటిల్ పర్ఫెక్ట్‌గా సూట్ అవుతుందని చెప్పొచ్చు. రవితేజ సినిమాకు ముందు టైగర్, మంచు విష్ణు సినిమాకు గాలి అని ఉంది.. కానీ ఈ మూడు ఒకే సౌండ్‌లా అనిపిస్తాయి. కాబట్టి వీరిలో ఎవరో ఒకరు టైటిల్ మార్చుకుంటారా అనేది.. ఆసక్తికరంగా మారింది. అయితే రవితేజ సినిమా పక్కన పెడితే.. విష్ణు మూవీకి మాత్రం జిన్నా అనే టైటిల్ పరిశీలనలో ఉన్నట్టు తెలుస్తోంది. మరి ఇలాంటి విషయాల్లో క్లారిటీ రావాలంటే.. మరికొద్ది రోజులు వెయిట్ చేయాల్సిందే.