Tollywood: ఈ వారం విడుదలయ్యే చిత్రాలు ఇవే!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Virupaksha: మెగాస్టార్ చిరంజీవి మేనల్లుడు, సుప్రీమ్ స్టార్ సాయిధరమ్ తేజ్ నటించిన ‘విరూపాక్ష’ సినిమా ఈ శుక్రవారం విడుదల కాబోతోంది. సాయిధరమ్ తేజ్ ముందు చిత్రం ‘రిపబ్లిక్’ 2021 అక్టోబర్ 1న వచ్చింది. అప్పటికే తేజ్ యాక్సిడెంట్ కారణంగా అనారోగ్యం పాలై పూర్తిగా కోలుకోలేదు. దాంతో ఆ మూవీ ప్రమోషన్స్ లో పాల్గొనలేక పోయాడు. ఇప్పుడు మాత్రం అవకాశం ఉన్నమేరకు ప్రమోషన్స్ చేస్తున్నాడు. పైగా యాక్సిడెంట్ తదనంతర పరిస్థితులనూ హృదయానికి హత్తుకునేలా వివరిస్తున్నాడు. ఇవన్నీ కూడా ‘విరూపాక్ష’ మూవీ మీద అంచనాలను పెంచేస్తున్నాయి. అయితే దీనికి ‘ఎ’ సర్టిఫికెట్ లభించడమే అభిమానులకు మింగుడు పడకుండా ఉంది. హారర్ కంటెంట్ తో పాటు హాట్ సీన్స్ కూడా ఇందులో ఉన్నాయనే ప్రచారం జరుగుతోంది. సీనియర్ ప్రొడ్యూసర్ బి.వి.ఎస్.ఎన్. ప్రసాద్ నిర్మించిన ఈ సినిమాకు కార్తీక్ దండు దర్శకత్వం వహించారు. సంయుక్త మీనన్ హీరోయిన్ గా నటిస్తున్న ‘విరూపాక్ష’ పాన్ ఇండియా మూవీగా విడుదల అవుతోంది. అయితే… ఇదే రోజున తెలుగులో మరికొన్ని సినిమాలు తమ అదృష్టం పరీక్షించుకోబోతున్నాయి.

అందులో ఒకటి ‘హలో మీరా’! ప్రముఖ దర్శకుడు బాపు శిష్యుడు కాకర్ల శ్రీనివాస్ ఈ సినిమాను సింగిల్ క్యారెక్టర్ తో రూపొందించారు. ఆ ఒక్క పాత్రను గార్గేయి ఎల్లాప్రగడ పోషించింది. రేపు వివాహ నిశ్చితార్థం అనగా మాజీ ప్రియుడి నిర్వాకం వల్ల ఓ యువతి ఎలాంటి ఇబ్బందుల్లో పడింది? అందులోంచి ఎలా బయటకొచ్చిందనేది ఈ చిత్ర ప్రధానాంశం. వీటితో పాటే గోపీ దేవెళ్ళ దర్శకత్వంలో నరేశ్ కుమార్ రెడ్డి నిర్మించిన ‘నెక్ట్స్ లెవల్’, శ్రవణ్ కుమార్ కొలను రూపొందించిన ‘టూ సోల్స్’ విడుదల కానున్నాయి. అలానే ‘టెన్ రూపీస్, కలియుగ భగవాన్’ చిత్రాలూ రిలీజ్ అవుతున్నాయి. ఇక ఆంగ్ల చిత్రం ‘ఈవిల్ డెడ్ రైజ్’ తెలుగులో డబ్ అయ్యి, 21న జనం ముందుకు వస్తోంది. ఈ రకంగా ఏడు సినిమాలు ఈ వీకెండ్ లో రిలీజ్ అవున్నా, అందరి దృష్టీ ‘విరూపాక్ష’ పైనే ఉంది.
Also Read
తాజావార్తలు
-
FIR Registered: బీజేపీ సీనియర్ మహిళా జాతీయ నాయకురాలిపై లైంగిక వేధింపులు.. అల్వాల్లో కేసు నమోదు..
-
Andhra Pradesh: కొత్తగా 4 పోలీస్ కమిషనరేట్లు.. విలీన గ్రామాలపై రీనోటిఫికేషన్
-
GST Council: అక్టోబర్ 7న జరగాల్సిన జీఎస్టీ సమావేశం వాయిదా.. మళ్లీ ఎప్పుడంటే..!
-
Off The Record : ఏలూరు నియోజకవర్గంలో జంపింగ్ జపాంగ్ కు కష్టాలు
-
Off The Record: కేతిరెడ్డికి ప్రాణహాని ఉందా? ట్రాప్ వెనుక ఎవరు?
ట్రెండింగ్
-
How to Make Murmura at Home: ప్రెజర్ కుక్కర్ ఉంటే చాలు.. ఇంట్లోనే కరకరలాడే బొరుగులు తయారు చేసుకోండి!
-
High-Protein Black Chana Soup: రాత్రిపూట తేలికైన, పౌష్టికమైన డిన్నర్.. నల్ల శనగల హై-ప్రోటీన్ సూప్ ట్రై చేయండి
-
Homemade Natural Lip Balm: ఖరీదైన లిప్ బామ్లకు చెక్.. ఇంట్లో ఉండే పదార్థాలతోనే సహజమైన లిప్ బామ్ రెడీ..!
-
How To Grow Mint Plant: ఒక్క పుదీనా కాడతో మొక్క పెంచేయొచ్చు.. ఈ సింపుల్ టిప్స్ పాటించండి
-
Chitti Punugulu: బయట కరకరలాడుతూ, లోపల దూదిలా ఉండే హోటల్ స్టైల్ “చిట్టి పునుగులు”.. ఇంట్లోనే పర్ఫెక్ట్ గా చేయండి ఇలా.!