NTV Telugu Site icon

Week Movies: ఈ వారం సినిమాలు ‘అవతార్ 2’ దెబ్బకి గల్లంతవుతాయా?

Week Movies

Week Movies

శుక్రవారం వస్తుంది అంటే సినీ అభిమానుల్లో జోష్ వస్తుంది. ఈ జోష్ కి, క్రిస్మస్ హాలిడేస్ కూడా తోడవడంతో, ఈ వీక్ సినిమాలని చూడడానికి థియేటర్స్ కి వెళ్లే ఆడియన్స్ ఎక్కువగానే ఉన్నారు… మరి ఈ వీక్ ఆడియన్స్ ని అలరించడానికి విడుదల కానున్న సినిమాలు ఏంటో చూద్దాం. తెలుగులో రెండు సినిమాలు డిసెంబర్ థర్డ్ వీక్ రిలీజ్ కి రెడీ అయ్యాయి, అందులో ఒకటి ‘ధమాకా’ కాగా మరొకటి ’18 పేజస్’.

రవితేజ నటిస్తున్న ‘ధమాకా’ సినిమాపై పాజిటివ్ ఒపీనియన్స్ ఉన్నాయి, ఈ మూవీతో రవితేజ సాలిడ్ కంబ్యాక్ ఇస్తాడని మాస్ మహారాజా ఫాన్స్ కాన్ఫిడెంట్ గా ఉన్నారు. ‘ధమాకా’ మూవీకి ’18 పేజస్’ నుంచి గట్టి పోటి ఎదురవ్వనుంది. ‘కార్తికేయ 2’తో నిఖిల్ మార్కెట్ పెరగడం, అందులో హీరోయిన్ గా నటించిన ‘అనుపమ పరమేశ్వరన్’ 18 పేజస్ లో కూడా హీరోయిన్ గా నటిస్తుండడంతో సినీ అభిమానుల్లో  అంచనాలు పెంచాయి. పైగా సుకుమార్ కథని అందిస్తుండడం ’18 పేజస్’ సినిమాపై అంచనాలు పెంచడానికి కారణం అయ్యింది. ఈ రెండు సినిమాలు డిసెంబర్ 23నే ఆడియన్స్ ముందుకి రానున్నాయి.

తమిళ్ నుంచి విశాల్ నటిస్తున్న యాక్షన్ మూవీ ‘లాఠీ’ డిసెంబర్ 22న ఆడియన్స్ ముందుకి రానుంది. యాక్షన్ ఎపిసోడ్స్ ప్రధాన ఆకర్షణగా రూపొందిన ‘లాఠీ’ మూవీ తమిళ్ తో పాటు హిందీ, తెలుగు భాషల్లో కూడా రిలీజ్ కానుంది. గత కొంతకాలంగా ఫ్లాప్స్ లో ఉన్న విశాల్ ‘లాఠీ’తో హిట్ కొడతాడని విశాల్ ఫాన్స్ హోప్ తో ఉన్నారు.

మలయాళం నుంచి డిసెంబర్ థర్డ్ వీక్ కి రెండు భారి సినిమాలు రిలీజ్ అవ్వనున్నాయి. బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేస్తున్న పృథ్విరాజ్ సుకుమారన్ హీరోగా నటిస్తున్న ‘కాపా’, యంగ్ హీరో నివిన్ పాళీ నటిస్తున్న ‘తురుముఖం’ సినిమాలు డిసెంబర్ 22న విడుదల కానున్నాయి. ఈ రెండు సినిమాల్లో ‘కాపా’పై ప్రేక్షకుల్లో భారి అంచనాలు ఉన్నాయి. ‘కడువ’ తర్వాత పృథ్విరాజ్ సుకుమారన్, డైరెక్టర్ ‘షాజీ కైలాష్’ కాంబినేషన్ లో వస్తున్న సినిమా కావడంతో ‘కాపా’ మంచి ఓపెనింగ్స్ రాబట్టే అవకాశం ఉంది.

గత కొంతకాలంగా పాన్ ఇండియా హిట్స్ ఇస్తున్న కన్నడ ఇండస్ట్రీ నుంచి డిసెంబర్ 23న ప్రేక్షకుల ముందుకి రానున్న సినిమా ‘వేద’. కన్నడ సూపర్ స్టార్ శివ రాజ్ కుమార్ హీరోగా నటిస్తున్న 125వ సినిమా ‘వేద’ రూపొందింది. ‘హర్ష’ డైరెక్ట్ చేసిన ఈ యాక్షన్ ఎపిక్ డ్రామాపై కన్నడ సినీ అభిమానుల్లో భారి అంచనాలు ఉన్నాయి. టీజర్, ట్రైలర్ కట్స్ తో సినిమాపై అంచనాలని అమాంతం పెంచిన చిత్ర యూనిట్ సాలిడ్ హిట్ పై కన్నేశారు. కంటెంట్ వైజ్ యూనివర్సల్ ఎమోషన్స్ ఉండడంతో ‘వేద’ సినిమా కన్నడలో హిట్ అయితే ఆ తర్వాత ఇతర భాషల్లోకి కూడా డబ్ అయ్యే అవకాశం ఉంది.

డిసెంబర్ 23నే థియేటర్స్ లోకి రానున్న హిందీ సినిమా ‘సర్కస్’. కమర్షియల్ సినిమాలకి కేరాఫ అడ్రెస్ అయిన రోహిత్ శెట్టి, స్టార్ హీరో రణవీర్ సింగ్ కాంబినేషన్ లో వస్తున్న ఈ ఫ్యామిలీ ఎంటర్టైనర్, 2022లో బాలీవుడ్ కి హ్యాపి ఎండింగ్ ఇస్తుందనే ఆశ అక్కడి ట్రేడ్ వర్గాల్లో ఉంది. రణవీర్ సింగ్ తో పాటు ఒక స్పెషల్ సాంగ్ లో దీపిక పదుకొణే కనిపించడంతో ‘సర్కస్’ సినిమాకి మంచి ఓపెనింగ్స్ అయితే వస్తాయి కానీ అది ఎలా కంటిన్యు అవుతుంది అనేది సినిమా టాక్ పైనే ఆధారపడి ఉంది.

నార్త్ నుంచి సౌత్ వరకూ డిసెంబర్ 23న విడుదల కానున్న ఈ సినిమాలకి ‘అవతార్ 2’ నుంచి సాలిడ్ కాంపిటీషన్ ఉంది. ఈ విజువల్ వండర్ ని థియేటర్స్ లో చూడడానికి ఆడియన్స్ క్యూ కడుతున్నారు. ఇండియాలోని మేజర్ మల్టీప్లెక్స్ ని ‘అవతార్ 2’ కబ్జా చేసింది. ఇలాంటి సమయంలో ‘అవతార్ 2’ని దాటి ఆడియన్స్ ని తమ సినిమాకి రప్పించుకోవడం అనేది కష్టమైన పనే. భారి హిట్ టాక్ వస్తేనే ఈ సినిమాలు థియేటర్స్ లో నిలుస్తాయి లేదంటే ‘అవతార్ 2’ ముందు డిసెంబర్ 23న రిలీజ్ కానున్న సినిమాలు గల్లంతు అవ్వడం గ్యారెంటి.

 

Show comments