Site icon NTV Telugu

Nikhil: పెళ్లైన రెండేళ్లకే విడాకులు.. నిఖిల్‌ ఏమన్నాడంటే..?

Nikhil

Nikhil

Nikhil: సోషల్ మీడియా వచ్చాకా ఎవరు ఎలాంటి పుకార్లు అయినా పుట్టించొచ్చు అన్న చందనా మారిపోయింది. ముఖ్యంగా సెలబ్రిటీల వ్యక్తిగత విషయాలను అయితే ఇష్టం వచ్చినట్టు రూమర్స్ క్రియేట్ చేస్తున్నారు. భార్యాభర్తలు కొన్నిరోజులు విడిగా ఉండడం ఆలస్యం వారి మధ్య విబేధాలు వచ్చాయని, త్వరలో వారు విడిపోతున్నారని రాసుకొచ్చేస్తున్నారు. మొన్నటికి మొన్న సానియా మీర్జా, నిన్న స్నేహ, నేడు నిఖిల్. కార్తికేయ 2 సినిమాతో పాన్ ఇండియా సక్సెస్ ను అందుకున్న నిఖిల్ ప్రస్తుతం ఆ సక్సెస్ ను ఎంజాయ్ చేస్తున్నాడు. ఇక నిఖిల్ వ్యక్తిగత విషయానికొస్తే 2020 లో డాక్టర్ పల్లవి వర్మను పెళ్లాడాడు.

ప్రస్తుతం ఈ జంట అన్యోన్యంగా కలిసి జీవిస్తున్నారు. అయితే గత కొన్నిరోజుల నుంచి ఈ జంట మధ్య విబేధాలు నెలకొన్నాయని, ఇద్దరు విడిపోవడానికి సిద్ధమవుతున్నారని వార్తలు గుప్పుమన్నాయి. అయితే నిఖిల్ ఈ వార్తలు ఖండించాడు. తన భార్యతో కలిసి ఉన్న ఫోటోను షేర్ చేస్తూ “నువ్వు పక్కన ఉన్న ప్రతిసారి కూడా అద్భుతం పల్లవి”అంటూ భార్యపై ప్రేమను చూపించేశాడు. ఇక దీంతో ఈ విడాకుల పుకార్లకు ఫుల్ స్టాప్ పడినట్లే అని తెలుస్తోంది. ఇకపోతే ప్రస్తుతం నిఖిల్ చేతిలో మూడు సినిమాలు ఉన్నాయి. 18 పేజీస్ షూటింగ్ ను ఫినిష్ చేసుకొని రిలీజ్ కు సిద్ధమవుతుండగా.. పాన్ ఇండియా సినిమాగా తెరకెక్కుతున్న స్పై సెట్స్ మీద ఉంది. మరి ఈ సినిమాతో ఈ కుర్ర హీరో ఎలాంటి విజయాలను అందుకుంటాడో చూడాలి.

Exit mobile version