Site icon NTV Telugu

సాయి తేజ్ ఫోటోలు.. మెగా ఫ్యామిలీ అందుకే బయటపెట్టడంలేదా..?

మెగా మేనల్లుడు సాయి తేజ్ రోడ్డు ప్రమాదం నుంచి బయటపడ్డ విషయం తెల్సిందే. ఎంతోమంది అభిమానుల ప్రార్థనలతో సాయి తేజ్ పూర్తిగా కోలుకొని ఇంటికి చేరాడు. అయితే కొన్నిరోజుల క్రితం ఇంటికి చేరుకున్నా సాయి తేజ్ ఫోటోలు మాత్రం బయటికి రావడం లేదు. సాయి తేజ్ కి చిన్న చిన్న గాయాలు మాత్రమే అయ్యాయని, సాయి తేజ్ త్వరలోనే అందరి ముందుకు వస్తాడని మెగా ఫ్యామిలీ చెప్తున్నా.. అభిమానుల్లో మాత్రం అనేక అనుమానాలు నెలకొన్నాయి. ఇప్పటివరకు సాయి తేజ్ ఒక చేతిని మాత్రమే చూపించాడు తప్ప ముఖాన్ని చూపించలేదు. దీంతో సాయి తేజ్ కి ముఖంపై గట్టిగానే దెబ్బలు తగిలాయని, అందుకే మెగా ఫ్యామిలీ తేజ్ ఫోటోలను బయటపెట్టడంలేదని వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. అయితే.. తేజు ఫోటోలను బయటపెట్టకపోవడానికి కారణం ఉందన్న మాట మెగా సర్కిల్స్ లో వినిపిస్తోంది.

ప్రమాదం తరువాత సాయి తేజ్ చికిత్స తీసుకొని చాలా సన్నగా మారిపోయాడంట.. ప్రమాదం ముందు తేజ్ కొద్దిగా బొద్దుగా ఉన్న విషయం తెల్సిందే. ప్రస్తుతం తేజ్ బక్కచిక్కి ఉండడంతో ఫోటోలు బయటికి రాకుండా ఉండేదుకు మెగా ఫ్యామిలీ చర్యలు తీసుకుంటున్నారని టాక్. ఒకట్రెండు వారాల్లో ఆయన పూర్తిగా సెట్ అయిపోతారని తెలుస్తోంది. ఒకటి, రెండురోజులకు ఒకసారి గెస్ట్ లను కలుస్తున్నాడంట తేజ్.

Exit mobile version