ఇంటర్వ్యూ వీడియోతో “ఆచార్య” ప్రమోషన్లను స్టార్ట్ చేశారు టీం. తాజాగా రామ్ చరణ్, కొరటాల శివ ఇద్దరూ కలిసి ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. ఈ సినిమాలో తండ్రీకొడుకులు చెర్రీ, చరణ్ కలిసి నటిస్తున్న విషయం తెలిసిందే. అయితే రామ్ చరణ్ ‘ఆర్ఆర్ఆర్’ షూటింగ్ లో బిజీగా ఉన్నప్పుడే ‘ఆచార్య’ షూటింగ్ లో కూడా పాల్గొనాల్సి వచ్చింది. మాములుగా జక్కన్న తన సినిమా పూర్తయ్యేదాకా హీరోలను బయట ప్రాజెక్టుల్లో అడుగు పెట్టనివ్వడు. మరి చెర్రీ రెండు సినిమాలను ఎలా మేనేజ్ చేశారు ? అనే సందేహం అందరిలో కలిగింది. తాజా ఇంటర్వ్యూలో దీనికి సమాధానం ఇచ్చారు చరణ్.
Read Also : Ram Charan: అందుకే నాన్నకు నాలుగేళ్లుగా దూరంగా ఉంటున్నా..
ఈ ఇంటర్వ్యూలో రామ్ చరణ్ RRRతో బిజీగా ఉండడంతో డేట్స్ లేనప్పటికీ ‘ఆచార్య’లో కీలక పాత్ర పోషించడానికి సమయాన్ని ఎలా తీసుకున్నాడో వెల్లడించాడు. తాను, దర్శకుడు శివ ఈ విషయమై రాజమౌళిని సంప్రదించడానికి చాలా భయపడ్డామని, సహాయం చేయమని చిరంజీవిని కోరినట్లు చరణ్ వెల్లడించాడు. భారమంతా మెగాస్టార్ పై వేయడంతో ఆయన వెళ్లి రాజమౌళిని కలిసి, చరణ్ ‘ఆచార్య’ను పూర్తి చేయడానికి కొన్ని రోజులు విడిచి పెట్టమని ఒప్పించారట. అంతేకాకుండా తండ్రీ కొడుకులిద్దరినీ ఒకేసారి స్క్రీన్‌పై చూడాలనేది తన తల్లి కోరిక అని రామ్ చరణ్ వెల్లడించాడు. ఇక చెర్రీ, కొరటాల ఈ ఇంటర్వ్యూలో పలు ఆసక్తికరమైన విషయాలను వెల్లడించారు. “ఆచార్య” చిత్రం ఏప్రిల్ 29న ప్రేక్షకుల ముందుకు రానుంది.