డేరింగ్ అండ్ డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్… రెబల్ స్టార్ ప్రభాస్ ని ప్రెజెంట్ చేసినట్లు ఏ డైరెక్టర్ చూపించలేదేమో. సింపుల్ హీరోయిజం, సూపర్బ్ వన్ లైనర్ డైలాగ్స్, మాస్ కి కేరాఫ్ అడ్రెస్ లాంటి బాడీ లాంగ్వేజ్ ని చూపిస్తూ ప్రభాస్ ని చూపించాడు. ఏక్ నిరంజన్ బాగానే ఉంటుంది కానీ బుజ్జిగాడు సినిమా మాత్రం ఇంకో రకం. టిప్పర్ లారీ వెళ్లి స్కూటర్ ని గుద్దితే ఎలా ఉంటుందో తెలుసా అనే డైలాగ్ ని ప్రభాస్ ఫ్యాన్స్ ఈరోజుకీ వాడుతూ ఉంటారు. ప్రభాస్ కటౌట్ కి పర్ఫెక్ట్ గా సరిపోయే డైలాగ్ ఇది. పూరి జగన్నాథ్ రాసిన ఈ ఒక్క డైలాగ్ మాస్ ని రీడిఫైన్ చేసింది. బుజ్జిగాడు సినిమాలోనే మరో మాస్ సెన్సేషనల్ డైలాగ్ ఉంది. ప్రభాస్ సుబ్బరాజ్ కి వార్నింగ్ ఇస్తూ… “బాగున్నావ్ రా… నా బండి చూసావా, ఇసుజు ఇంజన్ రయ్ రయ్ రయ్ హార్స్ పవర్ ఎక్కువ…” అనే డైలాగ్ చెప్తాడు.
ఈ డైలాగ్ కి సరిపోయే విజువల్ ని ఇచ్చాడు ప్రశాంత్ నీల్. సలార్ పార్ట్ 1 సీజ్ ఫైర్ సినిమా డిసెంబర్ 22న గ్రాండ్ గా రిలీజ్ అయ్యింది. దేవరథ అనే క్యారెక్టర్ లో ప్రభాస్ ని ప్రెజెంట్ చేసిన ప్రశాంత్ నీల్… శృతి హాసన్ ని సేవ్ చేసే ఎపిసోడ్ లో… ఇదే సినిమాలో దాదాపు ఫస్ట్ యాక్షన్ ఎపిసోడ్. ఈ ఫైట్ సీన్ లో ప్రభాస్ పిడికిలి బిగించే ప్రయత్నం చేస్తాడు, ఈ టైమ్ లో ఇంజన్ స్టార్ట్ అయ్యే బ్యాక్ గ్రౌండ్ స్కోర్ వచ్చి ఆగిపోతుంది. రెండు సార్లు ప్రభాస్ పిడికిలి బిగించే ప్రయత్నం చేయడం బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ఇంజన్ స్టార్ట్ అవుతున్నట్లు అయ్యి ఆగిపోవడం జరుగుతుంది. లాస్ట్ కి ప్రభాస్ పిడికిలి బిగించగానే బ్యాక్ గ్రౌండ్ లో ఇంజన్ స్టార్ట్ అయిన సౌండ్ వస్తుంది. ఈ సీన్ థియేటర్ లో కూర్చోని సినిమా చూస్తున్న ప్రతి ఒక్కరికీ బుజ్జిగాడు డైలాగ్ ని గుర్తు చేసింది. ప్రభాస్ ఇసుజు ఇంజన్ లాంటి ఫిజిక్ కి ప్రశాంత్ నీల్ సూపర్బ్ విజువల్ ఇచ్చాడు.