NTV Telugu Site icon

కీర్తి సురేష్ ను ‘ఐరన్ లెగ్’ అన్నారట !

keerthy-suresh

సౌత్ స్టార్ హీరోయిన్ కీర్తి సురేష్ “గుడ్ లక్ సఖి” చిత్రంతో ఇటీవలే ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అయితే ఈ మూవీ ప్రేక్షకులను పెద్దగా ఆకట్టుకోవడం లేదు. దీంతో తెలుగులో ‘మహానటి’ తర్వాత కీర్తికి బ్లాక్‌బస్టర్ లేదని ఆమె అభిమానులు నిరాశకు గురవుతున్నారు. ఇదిలా ఉంటే ‘ఐరన్ లెగ్’ అనే బాధాకరమైన టైటిల్‌కి తాను కూడా బలి అయ్యానని కీర్తి సురేష్ చెప్పింది. ఆమె కెరీర్ ప్రారంభంలో ఇలా జరిగిందని కీర్తి తాజాగా వెల్లడించింది.

Read Also : కాస్ట్లీ బైకులపై మనసు పారేసుకుంటున్న బిగ్ బాస్ భామలు

కీర్తి తన నటనా జీవితాన్ని మలయాళ చిత్రంతో ప్రారంభించింది. అనివార్య కారణాల వల్ల ఆ సినిమా మధ్యలోనే ఆగిపోయింది. అదేవిధంగా ఆమె తదుపరి రెండు చిత్రాలు కూడా అంతర్గత సమస్యల కారణంగా అకస్మాత్తుగా ఆగిపోయాయి. దీంతో వెంటనే కీర్తికి ‘ఐరన్ లెగ్’గా ముద్ర పడింది. మొదట్లో ఇలాంటి వ్యాఖ్యలు తనను బాధించాయని చెప్పింది. కానీ నేడు కృషి, పట్టుదల ఆమె అనూహ్యమైన విజయాన్ని సాధించడంలో సహాయపడింది. ‘మహానటి’ సమయంలో ఆమెను గోల్డెన్ లెగ్ అని పిలిచారు. కానీ ఆ తర్వాత మిస్ ఇండియా, పెంగ్విన్, రంగ్ రే వంటి వరుస ఫ్లాప్‌లను చూసిన కీర్తి ఇప్పుడు ‘గుడ్ లక్ సఖీ’తో ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయింది. నాలుగు వరుస ఫ్లాప్ లతో కీర్తి బ్యాడ్ లక్ కొనసాగుతోంది. కానీ ఇప్పుడు కీర్తి చేతిలో సర్కారు వారి పాట, దసరా, భోళా శంకర్ వంటి భారీ చిత్రాలు ఉన్నాయి. మరి ఈ సినిమాలతో కీర్తి ఆకట్టుకుంటుందేమో చూడాలి.