NTV Telugu Site icon

They Call Him OG: పర్ఫెక్ట్ ఫ్యాన్ బాయ్ సంభవం లోడింగ్…

Sujith

Sujith

‘గబ్బర్ సింగ్’… ఒక ఫ్యాన్ దర్శకుడిగా మారి తన హీరోని డైరెక్ట్ చేస్తే ఎలా ఉంటుందో నిరూపించిన సినిమా. పవర్ ప్యాక్డ్ ఫైట్స్, సూపర్బ్ వన్ లైన్ డైలాగ్స్, హీరో క్యారెక్టర్ లో స్వాగ్, సీన్స్ లో ఎలివేషన్… ఇలా పవన్ కళ్యాణ్ కి పర్ఫెక్ట్ గా సెట్ అయ్యే యాటిట్యూడ్ తో ‘గబ్బర్ సింగ్’ సినిమాని రూపొందించాడు హరీష్ శంకర్. ఈ మూవీ వచ్చిన దశాబ్దం తర్వాత పవన్ కళ్యాణ్ మళ్లీ తన ఫ్యాన్ బాయ్ తో సినిమా చేస్తున్నాడు. స్టైలిష్ ఫిల్మ్ మేకర్ గా పేరున్న సాహో డైరెక్టర్ సుజిత్, పవన్ కళ్యాణ్ కి డై హార్డ్ ఫాన్. ఈరోజు సుజిత్ బర్త్ డే కావడంతో పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నారు. పవన్ ఫ్యాన్స్ సుజిత్ ఫోటోస్ ని వైరల్ చేస్తూ ట్వీట్స్ చేస్తున్నారు.

కేవలం అనౌన్స్మెంట్ పోస్టర్ తోనే పవన్ కళ్యాణ్ ఫాన్స్ కి ఈ రేంజ్ కిక్ ఇచ్చిన సుజిత్… లేటెస్ట్ గా OG టీజర్ తో గూస్ బంప్స్ ఇచ్చాడు. OG టీజర్ లో పవన్ కళ్యాణ్ కనిపించిన విధానం చూసి యాంటీ ఫ్యాన్స్ కూడా ఫిదా అయ్యారు. అర్జున్ దాస్ వాయిస్ ఓవర్, స్టన్నింగ్ కెమెరా యాంగిల్స్, పవన్ కళ్యాణ్ టెర్రిఫిక్ స్క్రీన్ ప్రెజెన్స్… అలాంటోడు మళ్లీ తిరిగొస్తున్నాడు అనే డైలాగ్, థమన్ కొట్టిన అదిరిపోయిన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ OG టీజర్ ని కంప్లీట్ ఫ్యాన్ స్టఫ్ గా మార్చేశాయి. పవన్ కళ్యాణ్ కంబ్యాక్ తర్వాత చేసిన సినిమాగా OG నిలవనుంది. రీజనల్ మార్కెట్ ని రూల్ చేస్తున్న పవన్ కళ్యాణ్ తో సుజిత్ పాన్ ఇండియా మూవీ చేస్తున్నాడు. తను ప్లాన్ చేసుకున్నట్లు, తన ఫెవరెట్ హీరోతో సుజిత్ పాన్ ఇండియా హిట్ ఏ రేంజులో కొడతాడో చూడాలి.

Show comments