Site icon NTV Telugu

Dootha: అక్కినేని హీరో కన్ను మలయాళ ముద్దుగుమ్మలపై పడిందే..

dootha

dootha

అక్కినేని నాగ చైతన్య ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్నాడు. ఇటీవలే బంగార్రాజు సినిమాతో విజయం అందుకున్న ఈ హీరో ప్రస్తుతం థాంక్యూ చిత్రంలో నటిస్తున్నాడు. ఇక దీంతో పాటు అమెజాన్ ప్రైమ్ కోసం దూత అనే ఒక హర్రర్ వెబ్ సిరీస్ లో నటిస్తున్నాడు. విక్రమ్ కె కుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సిరీస్ షూటింగ్ ఇటీవలే మొదలయ్యింది.

ఇక తాజాగా ఈ సినిమాలో చైతూ సరసన మలయాళ ముద్దుగుమ్మలు నటించనున్నారు. మళయాళ టాలెంటెడ్ యాక్ట్రెస్ పార్వతి మరియు ప్రియా భవాని శంకర్ లు నటిస్తున్నట్లు మేకర్స్ పేర్కొన్నారు. విక్రమ్ కె కుమార్ తో పాటు ఇద్దరు భామలతో చైతూ కలిసి దిగిన ఫోటోని హీరోయిన్ ప్రియా భవాని శంకర్ పోస్ట్ చేసింది. ఇక ఈ ఫొటోలో చైతూ లుక్ అదిరిపోయింది. తీరైన మీసకట్టు.. క్లీన్ షేవ్ తో కనిపిస్తున్నాడు. ప్రస్తుతం ఈ ఫోటో నెట్టింట వైరల్ గా మారింది. 13బి తో ప్రేక్షకులు భయపెట్టిన విక్రమ్ దూతతో ఏ విధంగా భయపెడతాడో చూడాలి.

Exit mobile version