Devara: టెక్నీషియన్స్ ని చూస్తేనే గ్లిమ్ప్స్ ఏ రేంజులో ఉంటుందో తెలుస్తుంది…
- Follow Us :
-
-
Add as a preferred
source on google
యంగ్ టైగర్ ఎన్టీఆర్… కొరటాల శివ కలిసి చేస్తున్న పాన్ ఇండియా సంభవం దేవర. గత వారం రోజులుగా సోషల్ మీడియాని షేక్ చేస్తున్న దేవర సినిమా, ఏప్రిల్ 5న బాక్సాఫీస్ పునాదులని కదిలించబోతుంది. ఎన్టీఆర్ ని సముద్ర వీరుడిగా చూపిస్తూ కొరటాల శివ ఒక కొత్త ప్రపంచాన్ని సిద్ధం చేసాడు. ఈ ప్రపంచం ఎలా ఉండబోతుందో చూపిస్తూ జనవరి 8న గ్లిమ్ప్స్ బయటకి రాబోతుంది. 72 సెకండ్ల నిడివితో దేవర గ్లిమ్ప్స్ బయటకి రానుంది. గ్లిమ్ప్స్ లో విజువల్ ఎఫెక్ట్స్ తేడా కొడితే ఆడియన్స్ కి దేవర సినిమాపై ఇంట్రెస్ట్ పోయే అవకాశం ఉంది. నెగటివిటీని కూడా ఫేస్ చేయాల్సి వస్తుంది… అయితే ఇప్పటివరకూ దేవర నుంచి బయటకి వచ్చిన టెక్నీషియన్స్ లిస్ట్ చూస్తే దేవర గ్లిమ్ప్స్ తేడా కొట్టే అవకాశమే కనిపించట్లేదు.
ఒక సినిమాకి పని చేస్తున్న టెక్నీషియన్స్ ని బట్టి ఆ సినిమా ఎలా ఉండబోతుంది అనే విషయాన్ని కొంత సినిమా నాలెడ్జ్ ఉన్న ఎవరైనా అర్ధం చేసుకోగలరు. ఈ లెక్కన చూస్తే ప్రస్తుతం కొరటాల శివ, తన రిసర్రక్షన్ మోడ్ లో గాడ్ లెవల్ సినిమా చేస్తున్నట్లు ఉన్నాడు. ఆర్ ఆర్ ఆర్ సినిమాని ఆస్కార్ రేంజులో ఎడిట్ చేసిన శ్రీకర్ ప్రసాద్, తన మ్యూజిక్ తోనే సినిమాలని పాన్ ఇండియా హిట్స్ అయ్యేలా చేస్తున్న మ్యూజిక్ డైరెక్టర్ అనిరుథ్, ఎన్నో సినిమాలకి ది బెస్ట్ సినిమాటోగ్రఫి ఇచ్చిన రత్నవేలు, రాజమౌళి ఆల్మోస్ట్ అన్ని సినిమాలకి ఆర్ట్ వర్క్ చేసే సాబు సిరిల్, ఫాస్ట్ అండ్ ఫ్యురియస్ మరియు మిషన్ ఇంపాజిబుల్ లాంటి సినిమాలకి స్టంట్ ఖొరియోగ్రఫి చేసిన కెన్నీ బేట్స్, జ్యాక్ సిండర్స్ జస్టిస్ లీగ్, డిస్నీ ఆక్వామాన్, బాట్ మాన్ Vs సూపర్ మాన్ సినిమాలకి ది బెస్ట్ విజువల్ ఎఫెక్ట్స్ ఇచ్చిన హాలీవుడ్ టెక్నిషియన్ ‘బ్రాడ్ మిన్నిచ్’ లాంటి టెక్నీషియన్స్ దేవర సినిమాకి వర్క్ చేసారు.
Also Read
దాదాపు 30 ఏళ్లుగా హాలీవుడ్ ఫిల్మ్ ఇండస్ట్రీలో ది బెస్ట్ సినిమాలకి విజువల్ ఎఫెక్ట్స్ ఇచ్చిన బ్రాడ్ మిన్నిచ్, దేవర సినిమాలోని సముద్ర బ్యాక్ డ్రాప్ ఎపిసోడ్స్ ని రియలిస్టిక్ గా చూపించడానికి జాయిన్ అయినట్లు ఉన్నాడు. ఆక్వామాన్ సినిమా చూసిన వాళ్లకి బ్రాడ్ మిన్నిచ్ విజువల్ ఎఫెక్ట్స్ రేంజ్ ఏంటో తెలుస్తుంది. గ్రాఫిక్స్ అండ్ రియల్ విజువల్స్ ని మెర్జ్ చేసి ఆడియన్స్ ది బెస్ట్ విజువల్ ఎక్స్పీరియన్స్ ఇస్తామని రత్నవేలు ఇప్పటికే అనౌన్స్ చేశాడు. ఈ లెక్కన దేవర సముద్ర బ్యాక్ డ్రాప్ లో చేసే ఫస్ట్ ఆఫ్ ఇట్స్ కైండ్ ఇండియన్ యాక్షన్ సినిమా అనే చెప్పాలి. ఇలాంటి టెక్నీషియన్స్ ఉండగా దేవర విజువల్ ఎఫెక్ట్స్ లో ఎలాంటి తప్పు జరిగే అవకాశం లేదు. మరి వీళ్లంతా కలిసి ఎలాంటి వండర్స్ క్రియేట్ చేసారు అనేది శాంపిల్ గా చూడాలి అంటే జనవరి 8 వరకూ వెయిట్ చేయాల్సిందే.
తాజావార్తలు
-
Colombia Earthquake : కొలంబియాలో భారీ భూకంపం.. 47 మంది మృతి, కూలిన భవనాలు.!
-
OTR : అసెంబ్లీకి వైసీపీ..? DSC రచ్చ వేళ కూటమి అలర్ట్.. బీసీ బిల్లుపై కీలక నిర్ణయం..!
-
Chairmans Desk : దేశంలో వ్యవస్థలు ఎటు పోతున్నాయి..? పాలన కంటే రాజకీయమేముఖ్యమైపోయిందా..?
-
OTR: రెడ్ ఐ ఎవరి మీద..?
-
Chit Fund Scam: రూ.2,000 కోట్ల చిట్‌ఫండ్ స్కామ్.. వెల్ఫేర్ గ్రూప్‌పై ఈడీ దాడులు..
ట్రెండింగ్
-
Kitchen Hacks : నూనె సీసాల జిడ్డు పోవాలంటే.. ఈ 4 చిట్కాలు ట్రై చేయండి.!
-
Bathroom Drain Cleaning Tips : బాత్రూమ్ డ్రెయిన్ జామ్ అవుతోందా? ఈ 2 పదార్థాలతో చిటికెలో క్లీన్.!
-
Home Hacks : కడాయి హ్యాండిల్‌పై గట్టి జిడ్డా? ఈ చిట్కాలతో కొత్తదానిలా మెరిపించండి.!
-
Cleaning Hacks : కిచెన్ డస్ట్‌బిన్ స్మెల్ కొడుతోందా.? ఇలా చేస్తే క్షణాల్లో క్లీన్.!
-
Pressure Cooker Rice Tips: కుక్కర్లో అన్నం పర్ఫెక్ట్గా రావాలంటే ఇదే సీక్రెట్.!