సినీ అభిమానులంతా వెయ్యి కళ్లతో ఎదురుచూస్తున్న సినిమాల్లో కెజిఎఫ్ 2 ఒకటి. కన్నడ సూపర్ స్టార్ యష్, శ్రీనిధి శెట్టి జంటగా సెన్సేషనల్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాను హోంబాలే ఫిల్మ్స్ అత్యంత భారీ బడ్జెట్ తో నిర్మిస్తుంది. ఇప్పటికే కెజిఎఫ్ తో అంచనాలను తారుమారుచేసి పాన్ ఇండియా లెవల్లో హిట్ అందుకున్న ఈ సినిమ సెకండ్ పార్ట్ గా కెజిఎఫ్ 2 రానుంది. ఇక ఇప్పటికే ఈ చిత్రం నుంచి విడుదలైన పోస్టర్స్, టీజర్, సాంగ్ రికార్డులను బద్దలుకొట్టిన సంగతి తెలిసిందే. ఇక తాజాగా ఈ సినిమా ట్రైలర్ ని మరి కొద్దీ నిమిషాల్లో మేకర్స్ రిలీజ్ చేయనున్నారు. కాగా అన్ని భాషల్లో విడుదలవుతున్న ఈ ట్రైలర్ ని ఆ భాషల్లోని స్టార్ హీరోలు రిలీజ్ చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించారు. మరి ఏఏ భాషల్లో ఏఏ హీరో ఈ ట్రైలర్ ని రిలీజ్ చేస్తున్నారో చూద్దాం
తెలుగులో ఇప్పటికే ఈ మెగా ట్రైలర్ ని మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ విడుదల చేస్తున్నట్లు ఉదయమే తెలిపారు. ఇక తమిళ్ లో స్టార్ హీరో సూర్య విడుదల చేస్తుండగా.. మలయాళంలో టాలెంటెడ్ హీరో పృథ్వి రాజ్ సుకుమారన్ రిలీజ్ చేయనున్నాడు. ఇక కన్నడలో స్టార్ హీరో శివ రాజకుమార్ చేతుల మీదుగా లాంచ్ అవుతుండగా హిందీలో డైరెక్టర్, నటుడు ఫరాన్ అక్తర్ రిలీజ్ చేస్తున్నట్లు ప్రకటించారు. ఎన్నో రోజుల నుంచి అభిమానులు ఈ క్షణం కోసం ఎదురుచూస్తుండగా.. ఎప్పుడెప్పుడు ట్రైలర్ రిలీజ్ అవుతుందో అని ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇక ఈ సినిమా ఏప్రిల్ 14 న ప్రపంచవ్యాపంగా అభిమానులముందుకు రానుంది.
