విక్టరీ వెంకటేష్, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్‌లో ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న క్రేజీ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ “ఆదర్శ కుటుంబం హౌస్ నెం. 47. సితార ఎంటర్టైన్మెంట్స్ నిర్మిస్తున్న ఈ సినిమాను అక్టోబర్ 2న గాంధీ జయంతి సందర్భంగా విడుదల చేయబోతున్నట్లు ఇటీవల వార్తలు వినిపించాయి. కానీ పరిస్థితులు చూస్తుంటే అందుకు అనుగుణంగా లేవు అనే టాక్ వినిపిస్తోంది. ఫిల్మ్ నగర్ వర్గాల్లో ఈ సినిమా విడుదలపై ఒక షాకింగ్ గాసిప్ గట్టిగా వినిపిస్తోంది. ఈ మోస్ట్ అవేటెడ్ మూవీ అనుకున్న సమయానికి రావడం లేదని వాయిదా పడే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయని టాక్ నడుస్తోంది.
ఈ సినిమా షూటింగ్ లో కొన్ని అవాంతరాలు ఎదురయ్యాయని, కొన్ని సీన్స్ రీ షూట్ చేస్తున్నారని అక్టోబర్ 2లు షూటింగ్ ఫినిష్ అయ్యే అవకాశం లేదని టాక్. ఒకవేళ ఈ అక్టోబర్ లాంగ్ వీకెండ్ డేట్‌ను గనుక మేకర్స్ మిస్ చేసుకుంటే.. ఆ తర్వాత ఈ ఏడాదిలో సరైన విండో దొరకడం కష్టమేనని ఇండస్ట్రీ విశ్లేషకులు భావిస్తున్నారు. అదే జరిగితే, ‘AK 47’ చిత్రాన్ని ఏకంగా 2027 సమ్మర్ సీజన్‌కు మాత్రమే పోస్ట్‌పోన్ చేసే అవకాశాలు ఉన్నట్లు గట్టిగా ప్రచారం సాగుతోంది. అయితే ఈ గాసిప్స్ పై ప్రొడక్షన్ హౌస్ నుండి ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు అలాగే ఖండించలేదు. దీంతో వెంకీ ఫ్యాన్స్ కాస్త కంగారు పడుతున్నారు. మరి ఈ క్రేజీ ప్రాజెక్ట్ అనుకున్న సమయానికే వస్తుందా లేదా లాంగ్ డిలే అవుతుందా అనేది తెలియాలంటే మేకర్స్ క్లారిటీ ఇచ్చే వరకు వేచి చూడాల్సిందే.

