Site icon NTV Telugu

Chiru: నేను ఇగోకి వెళ్తే సినిమా నష్టపోతుంది… ఇందుకే నువ్వు మెగాస్టార్ అయ్యావు బాసు

Chiru

Chiru

టికెట్ రేట్స్ తగ్గించిన విషయంలో చిరంజీవి ఎంతో తగ్గి, ఏపీ ప్రభుత్వాన్ని రిక్వెస్ట్ చేసాడని స్వయంగా రాజమౌళి అంతటి వాడు చెప్తే కానీ చాలామందికి చిరు గొప్పదనం ఏంటో తెలియలేదు. సినిమాకి ఎంతో చేశాడు, సినిమా కష్టంలో ఉంది అంటే మౌనంగా ఉండలేడు కాబట్టే ఆయన మెగాస్టార్ అయ్యాడు. సినిమాల్లోని నటన మాత్రమే ఆయన్ని మెగాస్టార్ ని చెయ్యలేదు, నిజజీవితం లోని ఆయన స్వభావమే చిరుని అందరివాడులా మార్చింది. టికెట్ రేట్స్ విషయంలో జరిగిన లాంటిదే ఇప్పుడు మరోసారి జరిగింది. చిరు నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘వాల్తేరు వీరయ్య’ జనవరి 13న ప్రేక్షకుల ముందుకి రావడానికి సిద్ధంగా ఉంది. ఈ మూవీ ప్రమోషన్స్ లో భాగంగా వైజాగ్ లో ప్రీరిలీజ్ ఈవెంట్ ని చాలా గ్రాండ్ గా చేశారు. ముందుగా అనుకున్న ప్లేస్ లో కాకుండా చివరికి ఆఖరి నిమిషంలో ఒక ప్లేస్ కేటాయించి మీరు ఇక్కడ ఈవెంట్ చేసుకోండి అని పర్మిషన్ ఇచ్చింది జగన్ ప్రభుత్వం.

వాల్తేరు వీరయ్య సినిమా ప్రీరిలీజ్ ఈవెంట్ కి సరిగ్గా పర్మిషన్ ఇవ్వని ప్రభుత్వానికి, అధికారులకి కూడా థాంక్స్ చెప్తూ చిరు ‘వాల్తేరు వీరయ్య ప్రీరిలీజ్ ఈవెంట్’లో మాట్లాడాడు. అదేంటి చిత్ర యూనిట్ మొత్తాన్ని ఇబ్బంది పెట్టిన వాళ్లకి కూడా థాంక్స్ చెప్తున్నాడు చిరు, అంత మంచితనం అవసరమా? అన్నయ్య ఎందుకు తగ్గుతున్నాడు అంటూ మెగా అభిమానులు నిరాశ చెందారు. ఈ విషయంపై స్పందిస్తూ… “తగ్గడం అవసరమే… ప్రీరిలీజ్ ఈవెంట్ లో ఫైర్ అయితే నా ఇగో సాటిస్ఫై అవుతుంది కానీ సినిమా, ప్రొడ్యూసర్స్, ఫాన్స్ అంతా సఫర్ అవ్వాలి. అది సినిమాకి మంచిది కాదు కాబట్టి తగ్గడంలో తప్పు లేదు” అని చిరు చెప్పాడు. ఈ మాటలు వింటే ఇందుకే కదా అన్నయ్య నువ్వు మెగాస్టార్ అయ్యింది అని ఎవరైనా అనాల్సిందే. ఒక సినిమా కోసం అంత ఆలోచిస్తాడు కాబట్టే ఇప్పుడు ఆయన ఇండస్ట్రీకి పెద్ద దిక్కుగా ఉన్నాడు, ఆయన ఒప్పుకోకున్నా అదే నిజం.

Exit mobile version