NTV Telugu Site icon

Theppa Samudram: చైతన్య రావు తెప్ప సముద్రం.. ఎందులో .. ఎక్కడ చూడాలంటే?

Theppa Samudram Review

Theppa Samudram Review

Theppa Samudram: టాలీవుడ్ చైతన్య రావు, అర్జున్ అంబటి హీరోలుగా తెర‌కెక్కిన గ్రిప్పింగ్ స‌స్పెన్స్ థ్రిల్ల‌ర్ మూవీ ‘తెప్ప స‌ముద్రం’ ఏప్రిల్ 19న రిలీజ్ అయ్యింది. ఈ సినిమాలో కిశోరి దాత్రక్ హీరోయిన్ గా నటించింది. క్రైమ్ స‌స్పెన్స్ థ్రిల్ల‌ర్ మూవీగా వ‌చ్చిన ఈ సినిమా ఇప్పుడు ఓటీటీ స్ట్రీమింగ్ కి రెడీ అయ్యింది.ప్ర‌ముఖ తెలుగు ఓటీటీ ప్లాట్ ఫామ్ ఆహాలో ఈ మూవీ స్ట్రీమింగ్ కానుంది. ఆగ‌స్టు 3 నుంచి ఈ సినిమా ఓటీటీ స్ట్రీమింగ్ అవుతుంద‌ని మేక‌ర్స్ వెల్ల‌డించారు. స‌తీష్ రాపోలు డైరెక్ట్ చేయ‌గా శ్రీ‌మ‌ణి ఎంట‌ర్టైన్మెంట్స్ బ్యాన‌ర్ పై నీరుకంటి మంజులా రాఘ‌వేంద‌ర్ గౌడ్ ప్రొడ్యూస్ చేశారు. క్రైమ్ థ్రిల్ల‌ర్ ఇష్ట‌ప‌డే వారు ఈ సినిమాను త‌ప్ప‌క చూసి ఎంజాయ్ చేస్తార‌ని మేక‌ర్స్ కాన్ఫిడెంట్ గా చెబుతున్నారు. ఇక ఈ సినిమాను భ‌వానీ మీడియా డిజిట‌ల్ డిస్ట్రిబ్యూష‌న్ చేస్తోంది. మ‌రి ఈ సినిమా ఓటీటీ ఆడియెన్స్ ని ఎంత‌మేర ఆక‌ట్టుకుంటుందో చూడాలి.

Show comments