NTV Telugu Site icon

Samantha: అప్పుడు చైతూ.. ఇప్పుడు సామ్.. ఫాన్స్ దేన్నీ వదలరుగా

Chy

Chy

Samantha: అభిమానులు లేనిదే హీరోలు లేరులే అని వెంకటేష్ ఏదో సినిమాలో పాడతాడు. నిజంగా అభిమానులు లేకపోతే హీరోలు కానీ హీరోయిన్లు కానీ ఉండరు. తారలు ఎవరైనా, ఏది చేసినా అది అభిమానుల కోసమే, వారి ప్రేమ కోసమే చేస్తారు. ఫ్యాన్స్ సైతం తమ ఫెవరేట్ స్టార్లను ఎంత అభిమానిస్తారో.. వారిని ఎవరైనా ఏదైనా అంటే ఇచ్చిపడేస్తారు. ఇక ఈ అభిమానం సినిమాల వారికే కాదు తరాల పర్సనల్ లైఫ్ వరకు ఉంటుంది. వారికి హెల్త్ బాగోలేకపాయినా, ఇంకేదైనా బాధలో ఉన్నా ఈ అభిమానులే ఓదార్పు. అందుకు ఉదాహరణ.. సమంత- నాగ చైతన్య ఫ్యాన్స్. ఈ జంట ప్రేమించి పెళ్లి చేసుకున్నప్పుడు ఇద్దరి ఫ్యాన్స్ ఎంత సంతోషించారో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇక ఎంతో అన్యోన్యంగా ఉన్న ఈ జనతా నాలుగేళ్ళ తరువాత విడిపోయారు. అదుగో అప్పుడు మొదలయ్యింది ఈ ఫ్యాన్స్ మధ్య వార్. చై అభిమానులు సామ్ ది తప్పు అని.. సామ్ అభిమానులు చై వలనే ఇదంతా జరిగిందని చెప్పుకొచ్చారు. ఇలా ఈ వార్ కంటిన్యూ అవుతూనే ఉంది.

Taapsee Pannu: ఏరు దాటాక తెప్ప తగలేస్తున్నావా.. సిగ్గులేదు

ఇ సమయం వచ్చినప్పుడల్లా ఈ ఇద్దరు ఫ్యాన్స్ ట్విట్టర్ లో కొట్టేసుకుంటున్నారు. మొన్నా మధ్య చై నటించిన థాంక్యూ సినిమా ప్లాప్ అవ్వడంతో సామ్ అభిమానులు సంతోషిస్తూ కౌంటర్లు వేశారు.. చై కు కథలను మంచిగా ఎంచుకోవడం రాదని ఎద్దేవా చేస్తూ ట్రోల్స్ చేశారు. ఇక ఇప్పుడు చై అభిమానుల వంతు వచ్చింది. శాకుంతలం సినిమా ప్లాప్ టాక్ తెచ్చుకోవడంతో చై అభిమానులు అవే మాటలను తిరిగి చెప్తున్నారు. సామ్ కు కథలను ఎంచుకోవడం రాలేదని, శకుంతలగా సామ్ సెట్ అవ్వలేదని ట్రోల్స్ చేస్తున్నారు. ఇక వీరి ట్రోల్స్ చూస్తున్న నెటిజన్స్ ఫ్యాన్స్ అంటే ఇంతే దేన్నీ వదలరు.. ఇచ్చి పడేశారు అంటూ చెప్పుకొస్తున్నారు.

Show comments