Site icon NTV Telugu

Radhe Shyam : బెనిఫిట్ షో అడ్డుకున్న అధికారులు… గుర్తు పెట్టుకుంటామంటూ ఫ్యాన్స్ వార్నింగ్

Radhe-Shyam

దేశవ్యాప్తంగా “రాధేశ్యామ్” సందడి మొదలైంది. ఏ థియేటర్ వద్ద చూసినా ప్రభాస్ అభిమానుల రచ్చ కన్పిస్తోంది. స్లోగా సాగే లవ్ స్టోరీ అని రివ్యూలు వచ్చినప్పటికీ అభిమానుల హంగామా మాత్రం నెక్స్ట్ లెవెల్లో ఉంది. ఇక తెలంగాణాలో ఇప్పటికే బెనిఫిట్ షోలు వేయగా, ఆంధ్రాలో మాత్రం బెనిఫిట్ షోలకు అనుమతి లభించలేదు. కొద్ది రోజుల క్రితం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం విడుదల చేసిన కొత్త జీవో ప్రకారం ‘రాధే శ్యామ్’, ‘ఆర్ఆర్ఆర్’ సినిమాలకు టికెట్ ధరలను 10 రోజుల పాటు పెంచుకోవచ్చని ప్రభుత్వం ప్రకటించింది. అయితే ఎలాంటి బెనిఫిట్ షోలు లేకుండానే “రాధేశ్యామ్” ఆంధ్రాలో విడుదలైంది.

Read Also : Kamal Haasan : అఖండ విజయం… అరవింద్ కేజ్రీవాల్ కు అభినందనలు

ఏపీలో అధికారుల ఆదేశాలను కాదని బెనిఫిట్ షోలు వేస్తున్న థియేటర్లకు తాళాలు పడుతున్నాయి. తాజాగా శ్రీకాకుళం జిల్లా రాజాంలో “రాధేశ్యామ్” బెనిఫిట్ షోను వేయడానికి ప్రయత్నించిన ఎస్వీసీ థియేటర్ ను అధికారులు సీజ్ చేశారు. పోలీసులు, రెవెన్యూ అధికారులు థియేటర్ కు తాళాలు వేయడంతో ఈరోజు సినిమాను ప్రదర్శించడం లేదని థియేటర్ యాజమాన్యం ప్రకటించింది. ఇక విషయం తెలుసుకున్న ప్రభాస్ అభిమానులు ఈ విషయాన్ని ట్విట్టర్ లో షేర్ చేస్తూ బాగా గుర్తు పెట్టుకుంటామని హెచ్చరిస్తున్నారు. అంతేకాదు బహుశా పవన్ చెప్పిందే నిజమేమో అంటూ కామెంట్స్ చేస్తున్నారు.

Exit mobile version