Site icon NTV Telugu

HHVM : థియేటర్ల బంద్ ఇష్యూ.. ‘వీరమల్లు’కు మేలు చేసిందా..?

Hhvm

Hhvm

HHVM : టాలీవుడ్ లో థియేటర్ల బంద్ ఇష్యూ నిన్నటి దాకా పెద్ద రచ్చకు దారి తీసింది. థియేటర్ల బంద్ అంటే ఎగ్జిబిటర్ల నిరసన వల్ల బంద్ అవుతోంది అనే దాని కంటే.. హరిహర వీరమల్లు సినిమాను తొక్కేయడానికే బంద్ చేస్తున్నారు అనే ప్రచారం పెద్ద ఎత్తున సాగింది. థియేటర్ల్ బంద్ అంటే కేవలం పవన్ కల్యాణ్‌ సినిమాపై కుట్ర పూరితంగా చేస్తున్నదే అన్నట్టు సోషల్ మీడియా, ఇటు మెయిన్ మీడియాలో విస్తృతంగా కథనాలు వచ్చాయి. వీరమల్లు సినిమా కంటే ముందు భైరవం, థగ్ లైఫ్‌, లాంటి పెద్ద సినిమాలు ఉన్నా వాటి గురించి కనీసం చర్చ జరగలేదు. వీరమల్లు తర్వాత వారం గ్యాప్ లో వస్తున్న కుబేర, కన్నప్ప సినిమాల గురించి కూడా ఎవరూ పట్టించుకోలేదు.

Read Also : Nilave: ‘నిలవే’ నిజాయితీతో కూడిన మ్యూజికల్ లవ్ డ్రామా!

జూన్ లో ఉన్న పెద్ద సినిమాలన్నీ పక్కకు పోయి కేవలం వీరమల్లుపై మాత్రమే కుట్ర జరుగుతోందన్నట్టు ప్రచారం తెరమీదకు వచ్చింది. పవన్ కల్యాణ్‌ గత సినిమాలు వకీల్ సాబ్, భీమ్లా నాయక్ సమయంలో టికెట్ల రేట్లు తగ్గించి, థియేటర్లు మూసేసి కుట్ర చేశారని.. ఇప్పుడు డిప్యూటీ సీఎంగా ఉంటే ఇండస్ట్రీ తరఫున ఇబ్బందులు తీసుకొస్తున్నారంటూ సింపతీ వేవ్ క్రియేట్ అయింది. ఈ ప్రచారం వెనక ఎవరున్నానేది పక్కన పెడితే.. ఒక రకంగా ఈ సింపతీ మొత్తం హరిహర వీరమల్లుకే దక్కింది. ఆ సింపతీ కార్డు మూవీకి బజ్ క్రియేట్ చేసింది. అటు సినీ ప్రేక్షకుల్లో, ఇటు సాధారణ ప్రజల్లో ఒక రకమైన సింపతీ వేవ్ పెంచేసింది. మొత్తంగా అనుకోకుండా వచ్చిన ఒక ఇష్యూ వీరమల్లుకు ప్లస్ అయిందన్నమాట.

పైగా దీన్ని ముందుకు తీసుకెళ్లడంలో పవన్ ఫ్యాన్స్ బలంగా పనిచేశారు. వీరమల్లుకు ఇప్పటి వరకు పెద్దగా లేని బజ్ ఈ సింపతీతో క్రియేట్ అయిపోయిందనే చెప్పుకోవాలి. ఏ సినిమా గురించి అయినా ప్రజల్లో ఒక సింపతీ క్రియేట్ అయితే దానిపైనే పాజిటివ్ వైబ్స్ ఎక్కువగా ఉంటాయి. గతంలో అనేక సినిమాల విషయంలో ఇది ప్రూవ్ అయింది. ఒక సినిమాను తొక్కేస్తున్నారనే భావన ప్రజల్లో కలిగితే ఆ మూవీని కచ్చితంగా సపోర్ట్ చేయాలనే వాదనలు కూడా వస్తాయి. ఇప్పుడు వీరమల్లు విషయంలో ఇదే జరుగుతోంది. మొత్తం అనుకోకుండా వచ్చిన ఓ చిన్న వేవ్ వీరమల్లుకు కలిసొచ్చిందన్నమాట.

Read Also : Bellamkonda Sai Sreenivas: ఆ సర్ ప్రైజ్ ని ఆడియన్స్ చాలా ఎంజాయ్ చేస్తారు

Exit mobile version