Site icon NTV Telugu

The Warriorr Bullet Song: ఇక్కడ – అక్కడ శింబునే!

Rammm

Rammm

ఉస్తాద్ రామ్ పోతినేని హీరోగా లింగుస్వామి డైరెక్షన్ లో తెరకెక్కుతున్న మాస్ యాక్షన్ ఎంట‌ర్‌టైన‌ర్‌ ‘ది వారియర్’. ఆది పినిశెట్టి విలన్ గా నటిస్తున్న ఈ సినిమాను శ్రీనివాసా చిట్టూరి తెలుగు, తమిళ భాషల్లో నిర్మిస్తున్నారు. గతంలోనూ కొన్ని సెలక్టివ్ తెలుగు మూవీస్ లో పాటపాడిన శింబు ఇప్పుడు మరోసారి తన గొంతును సవరించుకున్నారు. విశేషం ఏమంటే ‘ది వారియర్’ తెలుగు, తమిళ వర్షన్స్ లో ఆయనే ‘బుల్లెట్’ సాంగ్ ను పాడారు. డీఎస్పీ సంగీతం అందించిన ఈ పాట రికార్డింగ్ కు సంబంధించిన స్నీక్ పీక్ ను ఈ రోజు విడుదల చేశారు. సాంగ్ ఫుల్ వర్షన్ 22వ తేదీ (శుక్రవారం) సాయంత్రం విడుదల కాబోతోంది. ‘డీఎస్పీ స్వరపరిచిన ఈ పాటకు యూఎస్పీ శింబు’ అంటూ కితాబిచ్చాడు హీరో రామ్. తెలుగు యాస తమిళంలోనూ, తమిళ యాస తెలుగులోనూ రాకుండా చాలా జాగ్రత్తగా శింబు ఈపాట పాడాడని మెచ్చుకున్నాడు. జూలై 14న విడుదల కాబోతున్న ‘ది వారియర్’లో కృతిశెట్టి హీరోయిన్ కాగా, అక్షరా గౌడ కీలక పాత్రలో కనిపించబోతోంది

 

Exit mobile version