Shriya Saran: టాలీవుడ్ సీనియర్ బ్యూటీ శ్రీయా శరన్ గురించి ప్రేక్షకులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. స్టార్ హీరోల సరసన నటించి మెప్పించిన ఈ భామ కెరీర్ పీక్స్ లో ఉన్నప్పుడే వివాహం చేసుకొని షాక్ ఇచ్చింది. ఇక రెండేళ్ల తరువాత తనకు కూతురు పుట్టింది అని చెప్పి ఇంకో షాక్ ఇచ్చింది. ఇక ప్రస్తుతం రీ ఎంట్రీ లో కూడా వరుస సినిమా అవకాశాలను అందుకోవడమే కాకుండా కుర్ర హీరోయిన్లకు పోటీగా అందాలను ఆరబోసి దేనికైనా సిద్ధం అంటోంది. ఇక ప్రస్తుతం శ్రీయ నటిస్తున్న చిత్రం దృశ్యం 2. మళయాలంలో సూపర్ హిట్ అయిన దృశ్యం 2 కు ఇది రీమేక్. ఇప్పటికే తెలుగులో ఈ సినిమాను వెంకీ మామ రీమేక్ చేసి రిలీజ్ కూడా చేశాడు. ఇక్కడ కూడా భారీ విజయాన్ని అందుకొంది. ఇక తాజాగా హిందీలో ఈ సినిమా రిలీజ్ కానుంది. అజయ్ దేవగన్, శ్రీయ జంటగా నటించిన ఈ చిత్రంలో టబు పోలీస్ ఆఫీసర్ గా కనిపించనుంది.
ఇక ఈ సినిమా యొక్క ప్రత్యేక ప్రీమియర్ షో కు పెద్ద ఎత్తున తారలు తరలి వచ్చారు. ఈ సందర్భంగా అజయ్ దేవగన్ తన భార్య కాజోల్ తో హాజరు అయ్యారు. శ్రీయ సైతం తన భర్తతో హాజరయ్యింది. ఇక ఈ ఈవెంట్ లో ఈ జంట కొద్దిగా హద్దుమీరి ప్రవర్తించడం హాట్ టాపిక్ గా మారింది. శ్రీయ మొదటి నుంచి పబ్లిక్ ప్లేస్ లలో భర్తకు లిప్ లాక్ ఇస్తూ కనిపిస్తూ ఉంటుంది. అయితే ఇప్పుడు కూడా అందరు చూస్తుండగా షో నుంచి బయటికి వచ్చిన తరువాత భర్తతో ఇదుగో ఇలా లిప్ లాక్ ఇస్తూ కనిపించింది. దీంతో శ్రీయ పనికి నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. బెడ్ రూమ్ లేదా.. పబ్లిక్ లో ఏంటి పాడు పని అని కొందరు అంటుండగా.. అంత మంది మీడియా ముందు మరియు ఎంతో మంది సినీ ప్రముఖులు ఉన్న సమయంలో అవసరమా ఇదేమైనా హాలీవుడ్ అనుకుంటున్నారా..? అంటూ తిట్టిపోస్తున్నారు. ప్రస్తుతం ఈ ఫోటో నెట్టింట వైరల్ గా మారింది.