The Trial Trailer: బాలీవుడ్ బ్యూటీ కాజోల్ పెళ్లి తరువాత త్రిభంగ అనే సిరీస్ తో ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి తెల్సిందే. ఇక ఈ సిరీస్ మంచి గుర్తింపును అందుకుంది. తాజాగా ఈ సిరీస్ తరువాత అమ్మడు నటిస్తున్న మరో సిరీస్ ది ట్రైల్. హాలీవుడ్ హిట్ సిరీస్ ది గుడ్ వైఫ్ కు రీమేక్ గా ఈ సిరీస్ తెరకెక్కుతుంది. మొదట ఈ సిరీస్ కు ది గుడ్ వైఫ్ అనే టైటిల్ నే ఫిక్స్ చేశారు. కానీ, అనుకోని కారణాలవలన చివరకు ది ట్రైల్ అనే పేరును ఫిక్స్ చేసినట్లు తెలుస్తోంది. సుపర్న్ వర్మ దర్శకత్వంవహించిన ఈ సిరీస్.. డిస్నీప్లస్ హాట్ స్టార్ లో జూన్ 14 నుంచి స్ట్రీమింగ్ కానుంది. ఇప్పటికే ఈ సిరీస్ నుంచి రిలీజైన పోస్టర్స్, వీడియోస్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. తాజాగా ఈ సిరీస్ ట్రైలర్ ను మేకర్స్ రిలీజ్ చేశారు. ట్రైలర్ ఆద్యంతం ఆకట్టుకొంటుంది.
Pawan Kalyan: బిగ్ బ్రేకింగ్.. జనసేనలోకి స్టార్ నిర్మాత
నైనికా సేన్ గుప్తా(కాజోల్) భర్త రాజీవ్ సేన్ గుప్తా.. అడిషనల్ జడ్జ్ గా పనిచేస్తుంటాడు. అయితే అతని వద్దకు వచ్చిన కేసులకు వ్యతిరేకంగా తీర్పు కావాలంటే.. అతని వద్దకు అమ్మాయిలను పంపించాలి. ఈసెక్స్ స్కాండల్ ఒకరోజు బయటపడుతుంది. దీంతో రాజీవ్ ను పోలీసులు అరెస్ట్ చేస్తారు. అయితే భర్త ఏ తప్పు చేయలేదని నైనికా నమ్ముతుంది. జూనియర్ లాయర్ గా వర్క్ చేస్తున్న నైనికా భర్త కేసు కోసం పోరాడుతుంది. ఒకసారి తప్పు చేస్తే అది పొరపాటు.. అదే తప్పు రెండోసారి చేస్తే అది అలవాటు అంటూ ఆమె చెప్తుండడం, భర్తను కొట్టడం లాంటివి ట్రైలర్ లో చూపించారు. అయితే ఆమె భర్త తప్పు చేశాడని ఆమెకూడా ఒప్పుకుందా..? మరి భర్త తరుపున ఎందుకు వాదించింది. అసలు ఇందులో ఏది నిజం..? ఏది అబద్దం..? అనేది తెలియాలంటే ది ట్రైల్ సిరీస్ ను చూడాల్సిందే. పర్ఫెక్ట్ కోర్టు డ్రామా విత్ థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ ఉన్నాయని ట్రైలర్ ను బట్టి తెలుస్తోంది. ఇక లాయర్ నైనికాగా కాజల్ అద్భుతంగా నటించింది.. ఆమె భర్తగా జిష్షు సేన్ గుప్తా నటించాడు. మరి ఈ సినిమాతో కాజోల్ ఎలాంటి హిట్ ను అందుకుంటుందో చూడాలి.
