NTV Telugu Site icon

Mega 156: విశ్వంభర.. సెట్ లో అడుగుపెట్టాడంటరోయ్.. ఇక కాసుకోండి

Mega 156

Mega 156

Mega 156: మెగాస్టార్ చిరంజీవి- వశిష్ఠ కాంబోలో తెరకెక్కుతున్న చిత్రం మెగా 156. యూవీ క్రియేషన్స్ మొదటిసారి చిరు సినిమాను నిర్మిస్తుంది. బింబిసార హిట్ తరువాత చిరు.. వశిష్ఠ టేకింగ్ కు ఫిదా అయ్యి ఈ ఛాన్స్ ఇచ్చాడు. కొన్ని రోజుల క్రితమే ఈ సినిమా పూజా కార్యక్రమాలను పూర్తిచేసుకుంది. అసలు అయితే.. ఈ సినిమా కన్నా ముందు చిరు.. కళ్యాణ్ కృష్ణతో ఒక సినిమా చేయాలి. కానీ, అది ఆగిపోవడంతో మెగా 157 నుంచి ఈ సినిమానే మెగా 156గా మారింది. ఇక ఈ సినిమాకు విశ్వంభర అనే టైటిల్ ను ఫిక్స్ చేసినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. పూజ అనంతరమే షూటింగ్ మొదలుకావాల్సి ఉంది. కానీ, చిరు మోకాలి సర్జరీ కోసం విదేశాలకు వెళ్లడం, వరుణ్ లావణ్య పెళ్లి.. ఇలా వరుసగా విశ్వంభర షూట్ వాయిదా పడుతూ వచ్చింది.

Vaishnav Tej: హీరోయిన్ రీతూ వర్మతో డేటింగ్.. క్లారిటీ ఇచ్చిన వైష్ణవ్ తేజ్

ఇక ఎట్టకేలకు నేడు.. ఈ సినిమా సెట్స్ మీదకు వెళ్ళింది. ఈ విషయాన్ని మేకర్స్ అధికారికంగా తెలిపారు. క్లాప్ బోర్డు ను షేర్ చేస్తూ.. మెగా 156 సెట్ లో అడుగుపెట్టింది అని చెప్పుకొచ్చారు. ఈ చిత్రంలో చిరు ముల్లోక వీరుడుగా కనిపించబోతున్నాడని టాక్ నడుస్తోంది. ఇక ఈ చిత్రంలో హీరోయిన్ గురించి ఎన్నో రూమర్స్ స్ప్రెడ్ అవుతున్నాయి. ముందు త్రిష అన్నారు.. ఆ తరువాత అనుష్క అన్నారు. ఏదిఇంకా ఫైనల్ కాలేదు. వశిష్ఠ.. ఈ సినిమాను చాలా ప్రెస్టీజియస్ గా తీసుకున్నాడని తెలుస్తోంది. భారీ బడ్జెట్ పెట్టడానికి యూవీ వెనుకాడదని అందరికి తెల్సిందే. మరి ఈ సినిమాతో చిరు ఎలాంటి హిట్ అందుకుంటాడో చూడాలి.