ఓటీటీ ల పుణ్యమా అని నిర్మాతలు ఒక రూపాయి అదనంగా వచ్చే శాటిలైట్ రైట్స్ డీల్స్ క్లోజ్ అయిపోయాయి. చిన్న హీరోల దగ్గర నుండి పెద్ద హీరోల వరకు ఎవరికి ప్రస్తుత పరిస్థితిలో శాటిలైట్ రైట్స్ కొనేందుకు వెనకాడుతున్నాయి శాటిలైట్స్ ఛానల్స్. అయితే కోలీవుడ్ స్టార్ హీరో అజిత్ గుడ్ బ్యాడ్ అగ్లీతో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన అజిత్ కుమార్ సినిమా శాటిలైట్ డీల్ క్లోజ్ కాలేదు.
Also Read : DilRaju : సినిమాల్లోకి రావాలనుకునే వారికోసం ‘దిల్ రాజు డ్రీమ్స్’
గుడ్ బ్యాడ్ అగ్లీ ఓటీటీ రైట్స్ ను భారీ ధరకు కొనుగోలు చేసింది నెట్ ఫ్లిక్స్. శాటిలైట్ కూడా మంచి ధర వస్తుందనుకున్న మేకర్స్ కు చేదు అనుభవం ఎదురైంది. వాస్తవానికి సన్ పిచర్స్ జిబియు శాటిలైట్ కొనేందుకు ముందు ఆసక్తి చూపించి మళ్ళి వెనక్కు తగ్గింది. కాగా లేటెస్ట్ గా వినిపిస్తున్న సమాచారం ప్రకారం గుడ్ బ్యాడ్ అగ్లీ శాటిలైట్ డీల్ క్లోజ్ అయింది. తమిళ ప్రముఖ టెలివిజన్ సంస్థ విజయ్ టీవీ ఈ సినిమా బుల్లెతెర స్ట్రీమింగ్ రైట్స్ ను కొనుగోలు చేసింది. ఇక్కడ మరో గమ్మత్తైన విషయం ఏంటంటే విజయ్ టీవీ హిస్టరీలో తొలిసారి అజిత్ సినిమాను కొనుగోలు చేసింది. అతి త్వరలోనే గుడ్ బాడ్ అగ్లీ విజయ్ టీవీలో స్ట్రీమింగ్ కానుంది. ఒకటి మాత్రం వాస్తవం. ఓటీటీ కారణంగానే అటు థియేటర్స్ లోను ఇటు టీవీలోను సినిమాలు చూసే సంఖ్య రోజు రోజుకు తగ్గుతూ వస్తుంది. ఫలితంగా శాటిలైట్ రైట్స్ డీల్స్ పై ఆ ప్రభావం పడుతుంది. నిర్మాతలకు వచ్చే ఆదాయానికి గండి కొడుతుంది.
