The Red Bag : చేతిలో గన్ను.. గురి తప్పని లుక్.. ఉత్కంఠ రేపుతున్న రాధ్య యాక్షన్ పోస్టర్

Raadhya

Raadhya

ఒక మిస్టరీ బ్యాగ్ చుట్టూ తిరిగే సరికొత్త సస్పెన్స్ యాక్షన్ థ్రిల్లర్ ‘ది రెడ్ బ్యాగ్’. ‘మెమరీ మేకర్స్’ బ్యానర్‌పై నూతన నిర్మాత హరికృష్ణ సోమిశెట్టి ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్న ఈ చిత్రానికి రవి కుమార్ సీరపు కథ, కథనం, దర్శకత్వ బాధ్యతలను నిర్వహిస్తున్నారు. కబీర్ సింగ్, ప్రసాద్ బెహరా, ఈషాన్ శంకర్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన ప్రచార చిత్రాలు సినిమాపై మంచి క్యూరియాసిటీని పెంచగా.. రీసెంట్‌గా విడుదల చేసిన రాశీ క్యారెక్టర్ పోస్టర్ ఆకట్టుకుంది. తాజాగా ఈ చిత్రం నుండి లీడ్ హీరోయిన్ రాధ్య మోస్ట్ పవర్‌ఫుల్ అండ్ ఇంటెన్సివ్ పోస్టర్‌ను మేకర్స్ విడుదల చేశారు.

తాజాగా విడుదలైన ఈ స్పెషల్ క్యారెక్టర్ పోస్టర్‌లో హీరోయిన్ రాధ్య లుక్ అందరినీ విపరీతంగా ఆకట్టుకుంటోంది. పోస్టర్‌లో ఆమె గన్ను పట్టుకున్న విధానం, కళ్లల్లో కనిపిస్తున్న పౌరుషం, చేతిలో ఉన్న ఒక మిస్టరీ వస్తువు ప్రేక్షకుల్లో సరికొత్త ప్రశ్నలను రేకెత్తిస్తున్నాయి. గ్లామర్‌కే పరిమితం కాకుండా కథను మలుపు తిప్పే ఒక బలమైన యాక్షన్ ఓరియెంటెడ్ పాత్రలో రాధ్య నటిస్తున్నట్లు ఈ పోస్టర్ చూస్తే స్పష్టమవుతోంది. ఈ చిత్రంలో రాధ్య లుక్, ఆమె క్యారెక్టరైజేషన్ సినిమాకే వన్ ఆఫ్ ది మెయిన్ హైలైట్‌గా నిలవబోతోందని చిత్ర యూనిట్ ధీమా వ్యక్తం చేసింది. తొలి ప్రయత్నమే అయినప్పటికీ నిర్మాత హరికృష్ణ సోమిశెట్టి టెక్నికల్ పరంగా సినిమాను చాలా రిచ్‌గా నిర్మించారు. విక్రమ్ రాజా ఈ చిత్రానికి అద్భుతమైన డైలాగ్స్ అందించగా, శేఖర్ మోపురి కట్టిపడేసే సంగీతాన్ని సమకూర్చారు. ప్రియేష్ గురుసామి సినిమాటోగ్రఫీ, శివ శర్వాని ఎడిటింగ్ బాధ్యతలు చేపట్టారు. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులను శరవేగంగా ముగించి, త్వరలోనే హై-వోల్టేజ్ టీజర్‌ను లాంచ్ చేయడానికి మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు.

×
×
Ad