The Red Bag : చేతిలో గన్ను.. గురి తప్పని లుక్.. ఉత్కంఠ రేపుతున్న రాధ్య యాక్షన్ పోస్టర్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఒక మిస్టరీ బ్యాగ్ చుట్టూ తిరిగే సరికొత్త సస్పెన్స్ యాక్షన్ థ్రిల్లర్ ‘ది రెడ్ బ్యాగ్’. ‘మెమరీ మేకర్స్’ బ్యానర్‌పై నూతన నిర్మాత హరికృష్ణ సోమిశెట్టి ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్న ఈ చిత్రానికి రవి కుమార్ సీరపు కథ, కథనం, దర్శకత్వ బాధ్యతలను నిర్వహిస్తున్నారు. కబీర్ సింగ్, ప్రసాద్ బెహరా, ఈషాన్ శంకర్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన ప్రచార చిత్రాలు సినిమాపై మంచి క్యూరియాసిటీని పెంచగా.. రీసెంట్గా విడుదల చేసిన రాశీ క్యారెక్టర్ పోస్టర్ ఆకట్టుకుంది. తాజాగా ఈ చిత్రం నుండి లీడ్ హీరోయిన్ రాధ్య మోస్ట్ పవర్ఫుల్ అండ్ ఇంటెన్సివ్ పోస్టర్‌ను మేకర్స్ విడుదల చేశారు.
తాజాగా విడుదలైన ఈ స్పెషల్ క్యారెక్టర్ పోస్టర్లో హీరోయిన్ రాధ్య లుక్ అందరినీ విపరీతంగా ఆకట్టుకుంటోంది. పోస్టర్లో ఆమె గన్ను పట్టుకున్న విధానం, కళ్లల్లో కనిపిస్తున్న పౌరుషం, చేతిలో ఉన్న ఒక మిస్టరీ వస్తువు ప్రేక్షకుల్లో సరికొత్త ప్రశ్నలను రేకెత్తిస్తున్నాయి. గ్లామర్‌కే పరిమితం కాకుండా కథను మలుపు తిప్పే ఒక బలమైన యాక్షన్ ఓరియెంటెడ్ పాత్రలో రాధ్య నటిస్తున్నట్లు ఈ పోస్టర్ చూస్తే స్పష్టమవుతోంది. ఈ చిత్రంలో రాధ్య లుక్, ఆమె క్యారెక్టరైజేషన్ సినిమాకే వన్ ఆఫ్ ది మెయిన్ హైలైట్‌గా నిలవబోతోందని చిత్ర యూనిట్ ధీమా వ్యక్తం చేసింది. తొలి ప్రయత్నమే అయినప్పటికీ నిర్మాత హరికృష్ణ సోమిశెట్టి టెక్నికల్ పరంగా సినిమాను చాలా రిచ్‌గా నిర్మించారు. విక్రమ్ రాజా ఈ చిత్రానికి అద్భుతమైన డైలాగ్స్ అందించగా, శేఖర్ మోపురి కట్టిపడేసే సంగీతాన్ని సమకూర్చారు. ప్రియేష్ గురుసామి సినిమాటోగ్రఫీ, శివ శర్వాని ఎడిటింగ్ బాధ్యతలు చేపట్టారు. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులను శరవేగంగా ముగించి, త్వరలోనే హై-వోల్టేజ్ టీజర్‌ను లాంచ్ చేయడానికి మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు.
Also Read
- The Paradise: నాని ‘ది ప్యారడైజ్’ ట్రైలర్ ఎప్పుడు ? రిలీజ్‌కు ముందు మేకర్స్ మాస్టర్ ప్లాన్ ఇదేనా!
- Samyuktha Menon: పుట్టినరోజు స్పెషల్ వీడియో.. ‘స్వయంభూ’లో వీరనారిగా సంయుక్త మీనన్!
- Mirzapur The Movie: ఓటీటీ సిరీస్ చరిత్రలోనే సరికొత్త రికార్డ్.. 7 రోజుల్లోనే రూ.200 కోట్ల క్లబ్లో ‘మీర్జాపూర్’!
- Mahendragiri Varahi: మహేంద్రగిరి వారాహి రివ్యూ..
తాజావార్తలు
-
Smart Watches: AMOLED డిస్ప్లే, రఫ్ అండ్ టఫ్ లుక్.. తక్కువ ధరల్లో స్మార్ట్‌వాచ్‌లు అందుబాటులోకి..
-
Saudi-Trump: హౌతీలపై దాడులు చేయాలని ట్రంప్‌కు సౌదీ విజ్ఞప్తి.. అధ్యక్షుడు షాకింగ్ రియాక్షన్
-
Putin Car: బుల్లెట్లు, బాంబులు ఏం చేయలేవు.. పుతిన్ ‘‘ఆరస్ సెనాట్’’ కారు ప్రత్యేకతలు ఇవే..
-
Bigg Boss Telugu: షాకింగ్ ఎలిమినేషన్.. బిగ్‌బాస్ హౌస్ నుంచి మరొకరకు ఔట్..
-
UPI Tap & Pay and MyUPI: సరి కొత్త ఫీచర్లు.. QR స్కాన్, పిన్ ఎంట్రీకి గుడ్‌బై.. ఇంటర్నెట్ లేకున్నా పేమెంట్స్..!
ట్రెండింగ్
-
Railways Child Ticket Rules: పిల్లలతో రైలు ప్రయాణమా.? వారికి టికెట్ తీసుకోవాలా లేదా.? రైల్వే రూల్స్ ఏమి చెబుతున్నాయంటే..
-
Vaibhav Sooryavanshi: వైభవ్ తక్కువోడు కాదయ్యో.. ప్రత్యర్థి కెప్టెన్‌నే స్లెడ్జ్ చేశాడు.. వీడియో వైరల్!
-
IP64 రేటింగ్, 7,000mAh బ్యాటరీతో సెప్టెంబర్ 16న రానున్న OPPO K14 Lite..!
-
iPhone 18 Proపై వేల రూపాయలు ఆదా.. అక్కడ కొంటే భారీగా డబ్బులు మిగలనున్నాయా.?
-
80s Photo Trend: నిపుణుల హెచ్చరిక.. మీరు ఇచ్చిన పర్సనల్ ఫొటోలను చాట్‌జీపీటీ ఎలా వాడుకుటుందో తెలుసా?