Site icon NTV Telugu

Red Bag: ఓ బ్యాగ్ చుట్టూ తిరిగే కథతో ‘ది రెడ్ బ్యాగ్’ సినిమా

Redbag

Redbag

థియేటర్, ఓటీటీల్లో ఎక్కువగా కాన్సెప్ట్ బేస్డ్ చిత్రాలే విజయాన్ని సాధిస్తున్నాయి. ఈ క్రమంలోనే ఓ బ్యాగ్ చుట్టూ తిరిగే కథతో ‘ది రెడ్ బ్యాగ్’ అనే సినిమాని హరికృష్ణ సోమిశెట్టి నిర్మించారు. ఈ మూవీకి రవి కుమార్ సీరపు కథ, కథనం, దర్శకత్వ బాధ్యతల్ని నిర్వర్తించారు. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన షూటింగ్‌ను టీం పూర్తి చేసింది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు శరవేగంగా జరుగుతున్నాయి.

Also Read:Dhurandhar 2: ధురంధర్-2 సినిమా వీక్షించిన పాక్ మాజీ ప్రధాని..రియాక్షన్ ఇదే!

కబీర్ దుహన్ సింగ్ , ప్రసాద్ బెహరా, రాధ్య, మోనిక, స్నేహా సింగ్, ఆకాంక్ష, ఈషాన్ శంకర్, అవినాష్ బదల్, భార్గవి తదితరులు నటించిన ఈ చిత్రాన్ని త్వరలోనే రిలీజ్ చేసేందుకు మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు. నిర్మాత ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా భారీ బడ్జెట్‌తో చిత్రాన్ని నిర్మించారు. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్‌‌ను హీరో దినేష్ తేజ్, రైటర్, డైరెక్టర్ హరి ప్రసాద్ రిలీజ్ చేసి చిత్రయూనిట్‌‌కు బెస్ట్ విషెస్ అందించారు. ఈ మూవీకి శేఖర్ మోపురి సంగీతమందించగా,విక్రమ్ రాజా రచన సహకారం అందించారు. ప్రియేష్ గురుసామి కెమెరామెన్‌గా, శివ శర్వాని,శశి ఎడిటర్‌గా పని చేశారు.

Exit mobile version