నేషనల్ క్రష్ రష్మిక మందన్నా (Rashmika Mandanna) కుడిచేతి మణికట్టుపై ఉన్న ‘ఇర్రీప్లేసబుల్’ (Irreplaceable) టాటూ గురించి సోషల్ మీడియాలో నిరంతరం వైరల్ అవుతూనే ఉంటుంది. ఇది విజయ్ దేవరకొండ కోసమే వేయించుకుందా? అంటూ బాలీవుడ్, టాలీవుడ్ మీడియా సర్కిల్స్ ఎప్పుడూ దీనికి లవ్ యాంగిల్ జోడిస్తూ గాసిప్స్ క్రియేట్ చేస్తుంటాయి. అయితే, దీని వెనుక ఉన్న అసలు నిజాన్ని, ఒక క్రేజీ ఫ్లాష్‌బ్యాక్‌ను రష్మిక స్వయంగా గతంలోనే ఇంటర్వ్యూలలో స్పష్టం చేశారు.
రష్మిక మాట్లాడుతూ.. ‘నిజం చెప్పాలంటే మొదట నాకు టాటూ వేయించుకోవాలనే ఐడియా అస్సలు లేదు. కానీ నేను కాలేజీలో ఉన్నప్పుడు ఒక అబ్బాయి నా దగ్గరకు వచ్చి.. ‘ఆడపిల్లలు అసలు పెయిన్ (బాధను) భరించలేరు. వాళ్లకు సూదులు అన్నా, ఇంజెక్షన్లు అన్నా చాలా భయం’ అంటూ కామెంట్ చేశాడు. అప్పుడు ఆడవాళ్లు దేనికైనా సిద్ధమే అని నిరూపించడం కోసం, వాడికి చూపించడం కోసమే ఎలాగైనా టాటూ వేయించుకోవాలని ఫిక్స్ అయ్యాను. కాపీ చేతిపై ఏం రాయించుకోవాలా అని చాలా సేపు ఆలోచించా.. నేను ఎప్పుడూ నా లైఫ్‌లో చాలా రియల్‌గా, నా లాగే ఉండాలనుకుంటాను. ఈ ప్రపంచంలో ఏ ఒక్క మనిషిని, మరొకరు భర్తీ చేయలేరని (No one can replace you) నేను బలంగా నమ్ముతాను. మనందరం మనదైన శైలిలో ‘ఇర్రీప్లేసబుల్’. ఆ విషయాన్ని నాకు నేను ఎప్పుడూ గుర్తుచేసుకోవడానికి, అలాగే నా ప్రొఫెషనల్ అండ్ పర్సనల్ లైఫ్‌లో ఒక గోల్ లాగా పెట్టుకోవడానికి ఈ పదాన్ని టాటూగా వేయించుకున్నాను’ అని రష్మిక క్లారిటీ ఇచ్చారు. కాబట్టి సోషల్ మీడియా పేజీలు అనుకుంటున్నట్లు ఈ టాటూకు హీరో విజయ్ దేవరకొండకు ఎలాంటి సంబంధం లేదని, ఇది ఆమె సెల్ఫ్-మోటివేషనల్ టాటూ అని స్పష్టమైంది.
