ప్రభాస్ హీరోగా మారుతి దర్శకత్వంలో ‘ది రాజా సాబ్’ అనే సినిమా రూపొందింది. టి.జి. విశ్వప్రసాద్ నిర్మాతగా ఈ సినిమాని ‘పీపుల్ మీడియా ఫ్యాక్టరీ’ బ్యానర్ మీద అత్యంత ప్రతిష్ఠాత్మకంగా నిర్మించారు. ఈ సినిమాలో నిధి అగర్వాల్, మాళవిక మోహనన్, రిధి కుమార్ హీరోయిన్లుగా నటించగా.. సంజయ్ దత్, జరీనా వాహబ్ వంటి వాళ్లు ఇతర కీలక పాత్రల్లో నటించారు.
Also Read:The Raja Saab Movie Review : ‘ది రాజా సాబ్’ రివ్యూ..ప్రభాస్ హిట్టు కొట్టాడా? లేదా?
ఇక ఈ సినిమా ఎన్నో వాయిదాల అనంతరం ఎట్టకేలకు ప్రేక్షకుల ముందుకు వచ్చేసింది. జనవరి 9వ తేదీన సంక్రాంతి సందర్భంగా ఈ సినిమా రిలీజ్ అనౌన్స్ చేశారు. అయితే ఒకరోజు ముందుగానే ప్రీమియర్స్ ప్రదర్శించారు. ముందు నుంచి ప్రచారం జరుగుతున్నట్టుగానే, ఈ సినిమాకి సంబంధించి సెకండ్ పార్ట్ అంటే సినిమాకి సంబంధించిన సీక్వెల్ అనౌన్స్ చేశారు.
Also Read:TTD Creates History: టీటీడీ కొత్త చరిత్ర.. ఈ ఏడాది రికార్డుస్థాయిలో వైకుంఠ ద్వార దర్శనాలు
‘ది రాజా సాబ్ పార్ట్ 2’ కి ‘రాజా సాబ్ సర్కస్ 1935’ అనే టైటిల్ ఫిక్స్ చేశారు. మొత్తం మీద ‘ది రాజా సాబ్’ సినిమాకి సంబంధించి టైటిల్ అనౌన్స్ చేశారు కానీ, అది సీక్వెల్ అవుతుందా లేదా ప్రీక్వెల్ అవుతుందా అనే విషయం మీద మాత్రం కన్ఫ్యూజన్ క్రియేట్ చేశారు. ఇక ప్రభాస్ ‘జోకర్’ లుక్ అయితే ఇరగదీసేలా ఉంది. మొత్తం మీద ఈ జోకర్ లుక్ ప్రభాస్ సెకండ్ పార్ట్ మీద అంచనాలు పెంచేశారనే చెప్పాలి.
