NTV Telugu Site icon

Ajith: కుర్ర హీరోయిన్లను ఎంకరేజ్ చేయని ఏకైక హీరో.. ?

Ajith

Ajith

Ajith: ఇండస్ట్రీలో ఎప్పుడు ఒకటే నడుస్తూ ఉంటుంది. హీరోలకు ఎంత ఏజ్ వచ్చినా వారు హీరోలే.. కానీ, హీరోయిన్లు పెళ్లి చేసుకుంటే మాత్రం హీరోయిన్లు కారు. ఇది ఏ ఇండస్ట్రీలో ఎక్కువ ఉందో లేదో తెలియదు కానీ.. టాలీవుడ్ లో ఎక్కువ ఉంది అని చెప్పొచ్చు. అయితే ఇప్పుడిప్పుడే ఈ ఆనవాయితీ పోతుంది అని చెప్పొచ్చు. ఇప్పుడున్న మార్కెట్ ను బట్టి.. స్టార్ హీరో సినిమా అయితే.. అందులో స్టార్ హీరోయిన్ ఉండాల్సిందే. మార్కెట్ లో నెంబర్ 1 గా ఉన్న హీరోయిన్ నటించాల్సిందే. ఇక్కడ ఏజ్ తో పనిలేదు. ఇది కేవలం సినిమా వరకు మాత్రమే. తెలుగు, తమిళ్, మలయాళం, కన్నడ .. ఇలా ఏ ఇండస్ట్రీ చూసుకున్నా.. హీరోకు వయస్సు పెద్ద ప్రాబ్లమ్ కాదు. స్టార్ హీరో పక్కన వారికన్నా తక్కువ కాదు కాదు.. చాలా తక్కువ ఉన్న హీరోయిన్ రొమాన్స్ చేస్తుంది. కానీ, ఒకే ఒక్క హీరో మాత్రం కుర్ర హీరోయిన్లను ఎంకరేజ్ చేయడం లేదు. అతనే కోలీవుడ్ స్టార్ హీరో అజిత్.

గత కొంతకాలంగా అజిత్ సినిమాలను చూస్తే.. ఆయన ఏ సినిమాలో కూడా కుర్ర హీరోయిన్లతో రొమాన్స్ చేసినట్లు కనిపించదు. త్రిష, మంజు వారియర్, నయనతార ఇలాంటి సీనియర్ హీరోయిన్లేకనిపిస్తారు . ఇక మరికొన్ని సినిమాల్లో అయితే అస్సలు ఆయనకు హీరోయినే ఉండదు. ఇక ప్రస్తుతం ఆయన నటిస్తున్న చిత్రం విదా ముయార్చి. ఈ చిత్రంలో కూడా త్రిష, రెజీనా నటిస్తున్నారు. మగిజ్ తిరుమేని దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటుంది. ఇక ఈ సినిమా కాకుండా అజిత్.. మార్క్ ఆంటోనీ డైరెక్టర్ అధిక్ రవిచంద్రన్ తో ఒక సినిమా చేయబోతున్నాడు. త‌ల అజిత్ 63వసినిమాగా తెరకెక్కుతున్న ఈ చిత్రం ఈ మధ్యనే సెట్స్ మీదకు వెళ్ళింది. ఇక అందుతున్న సమాచారం ప్రకారం.. ఈ సినిమాలో హీరోయిన్ గా సీనియర్ బ్యూటీ టబును తీసుకున్నట్లు తెలుస్తోంది. వీరిద్దరూ జంటగా ప్రియురాలు పిలిచింది అనే చిత్రంలో జంటగా నటించారు. ఇన్నేళ్ల తరువాత మళ్లీ ఈ జంట కలిసి నటించబోతున్నారు. వీరిద్దరి వయస్సు 52 యే కావడం విశేషం. ప్రస్తుతం ఈ న్యూస్ నెట్టింట వైరల్ గా మారింది.అజిత్ కథల సెలక్షన్ కన్నా.. హీరోయిన్స్ సెలక్షన్ బావుందని అభిమానులు చెప్పుకొస్తున్నారు. మరి ఈ సినిమా ఎలాంటి విజయాన్ని అందుకుంటుందో చూడాలి.