NTV Telugu Site icon

Ustaad Bhagat Singh: అరే సాంబ.. రాసుకోరా.. ఈసారి త్రిబుల్ ధమాకా కేక

Devi

Devi

Ustaad Bhagat Singh: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్- డైరెక్టర్ హరీష్ శంకర్ కాంబోలో తెరకెక్కిన గబ్బర్ సింగ్ ఎలాంటి రికార్డులు సృష్టించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. వరుస ప్లాపుల నుంచి పవన్ కళ్యాణ్ ను నిలబెట్టింది హరీష్ శంకరే అని చెప్పొచ్చు. ఇక వీరిద్దరి కాంబో ఇన్నేళ్ల తరువాత రీపీట్ కానుంది. అదే ఉస్తాద్ భగత్ సింగ్. మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ చిత్రంలో పవన్ సరసన శ్రీలీల నటిస్తోంది. ఇక ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ చిత్రానికి బ్లాక్ బస్టర్ మ్యూజిక్ డైరెక్టర్ దేవి శ్రీ ప్రసాద్ తోడయ్యాడు. గబ్బర్ సింగ్ అంటే.. పవన్- హరీష్- దేవిశ్రీ.. అని టక్కున చెప్పేయొచ్చు. గబ్బర్ సింగ్ టైటిల్ సాంగ్, కెవ్వు కేక లాంటి సాంగ్స్ ఇప్పటికీ వినిపిస్తున్నాయి అంటే.. దేవి కొట్టిన మ్యూజిక్ లోని మ్యాజిక్ అలాంటింది.

Ms Shetty Mr Polishetty: కాలేజ్ లో సందడి చేసిన ‘జాతిరత్నం’..

ఇక తాజాగా మరోసారి ఈ త్రిబుల్ కాంబో.. ఉస్తాద్ భగత్ సింగ్ కు సెట్ అయ్యిన్నట్లు మేకర్స్ అధికారికంగా తెలిపారు. హరీష్ శంకర్- దేవి శ్రీ ప్రసాద్ మ్యూజిక్ సిట్టింగ్స్ కోసం కలిసినట్లు వీడియో షేర్ చేశారు. ఇందులో హరీష్ శంకర్, దేవి శ్రీ కలిసి సినిమా గురించి మాట్లాడుకుంటున్నట్లు కనిపిస్తున్నారు. ఇక ఈ విషయం తెలియడంతో మేకర్స్ ఎగిరి గంతేస్తున్నారు. ఇంకోపక్క దేవికి అంతకు ముందు ఉన్న యాక్టివ్ నెస్ ఇప్పుడు లేదు.దేవి సైతం ఫ్రెష్ మ్యూజిక్ కాకుండా కాపీ కొట్టే మ్యూజిక్ ఇస్తున్నాడు అంటూ వార్తలు వినిపిస్తున్నాయి. దీంతో ఈ సినిమాపై కూడా అలాంటి నీలి నీడలు కమ్ముకుంటున్నాయి. దేవి.. ఈసారైనా పాత దేవిని గుర్తుచే అంటూ పవన్ ఫ్యాన్స్ చెప్పుకొస్తున్నారు. మరి ఈసారి ఈ రాక్ స్టార్ ఎలాంటి మ్యూజిక్ ఇస్తాడో చూడాలి.

Show comments