Site icon NTV Telugu

Tollywood : గ్యాప్ తీసుకుని వరుస సినిమాలతో వస్తున్న లక్కీ హీరోయిన్

Nayan Sarika

Nayan Sarika

2024 సెన్సేషనల్ హీరోయిన్ అంటే నయన్ సారికే అని చెప్పాలి. ఆయ్, క సినిమాలు బ్యాక్ టు బ్యాక్ హిట్స్‌ సాధించడంతో హీరోలకు లక్కీ లేడీగా మారింది. ఈ సక్సెస్‌ల దెబ్బకు టాలీవుడ్‌లో మేడమ్‌కు ఇక తిరుగులేదు అని అనుకుంటున్న టైంలో భారీ గ్యాప్ తీసుకుంది. ఈ గ్యాప్ నేనిచ్చింది కాదు వచ్చిందంతే అంటోన్న ఈ భామ సెలెక్టివ్‌గా సినిమాలు చేసుకుంటూ కెరీర్ బిల్డ్ చేసుకుంటోంది. ఈ నేపధ్యంలోనే మోహన్‌లాల్‌ వృషభతో హ్యాట్రిక్‌పై కన్నేసింది. కాని నిన్న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా ప్లాప్ టాక్ తెచ్చుకుంది.

Aslo Read : Sarvam Maya : 6 ఏళ్ల తర్వాత హిట్ అందుకున్న ప్రేమమ్ హీరో ‘నివిన్‌ పౌలీ’

ఈ ఏడాది గ్యాప్ ఇచ్చినా నెక్ట్స్ ఇయర్ మాత్రం వరుస సినిమాలతో టచ్‌లో ఉంటానంటోంది నయన్‌ సారిక. ప్రజెంట్ తెలుగులో శ్రీ విష్ణు సరసన విష్ణు విన్యాసంలో హీరోయిన్‌గా చేస్తోంది. ఈ సినిమా నెక్ట్స్ ఇయర్ ఫిబ్రవరిలో రిలీజ్ కాబోతోంది. అలాగే సంగీత్ శోభన్ హీరోగా తెరకెక్కుతోన్న ఓ సినిమాకు కూడా కమిటయ్యింది. నిహారిక కొణిదెల ఈ సినిమాను నిర్మిస్తోంది. ఇది కూడా వచ్చే ఏడాదే ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. కన్నడ స్టార్ హీరో.. గోల్డెన్ స్టార్ గణేష్ అప్ కమింగ్ ప్రాజెక్టు పినాకలో నటిస్తోంది. బైలింగ్వల్ మూవీగా తెరకెక్కుతోన్న ఈ మూవీని.. పాన్ ఇండియా లెవల్లో రిలీజ్ చేయనున్నారు మేకర్స్. షూటింగ్‌, వీఎఫ్‌ఎక్స్‌ కారణంగా ఈ సినిమా రిలీజ్‌ నెక్ట్స్‌ ఇయర్‌కి పోస్ట్‌పోన్‌ అయింది. విజువల్ వండర్‌గా తెరకెక్కుతోన్న పినాకను పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ నిర్మిస్తోంది.

Exit mobile version