NTV Telugu Site icon

The Kerala Story: సినిమా బాన్… ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ ఊహించని స్టేట్మెంట్

The Kerela Story

The Kerela Story

గత వారం రోజులుగా ఇండియాలో వినిపిస్తున్న ఒకే ఒక్క సినిమా పేరు ‘ది కేరళ స్టొరీ’. దేశం మొత్తం సంచలనం సృష్టిస్తున్న ఈ మూవీని ‘ది లాస్ట్ మాంక్’, ‘లక్నో టైమ్స్’ లాంటి సినిమాలని డైరెక్ట్ చేసిన ‘సుదిప్తో సేన్’ ది కేరళ స్టొరీ సినిమాని డైరెక్ట్ చేశాడు. అదా శర్మ, యోగిత బిహాని, సోనియా బలాని, సిద్ధి ఇద్నానీ ముఖ్యపాత్రల్లో నటించిన ది కేరళ స్టొరీ మే 5న రిలీజ్ అయ్యింది. “కేరళలో 32000 మంది అమ్మాయిలు కనిపించకుండా పోతున్నారు, ఇందులో ఎక్కువ శాతం హిందూ అమ్మాయిలే ఉంటున్నారు. వీరిని కొంతమంది ఆతంకవాదులు, ప్రేమ పేరుతో మోసం చేసి… మత మార్పిడి తర్వాత దేశం నుంచి బయటకి తీసుకోని వెళ్లి… అక్కడ నుంచి ఇండియాపైకి చెయ్యబోయే తీవ్రవాద కార్యకలాపాల్లో భాగం చేస్తున్నారు” అనే కథతో ‘ది కేరళ స్టొరీ’ సినిమా తెరకెక్కింది.

Read Also:Farhana : ఈ ప్రశ్నను మీరు హీరోలను ఎందుకు అడగరు

ఈ మూవీని తమిళనాడు, కేరళ, బెంగాల్ లాంటి రాష్ట్రాలు బాన్ చేశాయి. కాశ్మీర్ ఫైల్స్ తర్వాత ఆ స్థాయిలో ఒక సినిమాని కొన్ని రాష్ట్రాలు వ్యతిరేకించడం ఇదే మొదటిసారి. ప్రధాన మంత్రి సైతం ది కేరళ స్టొరీ గురించి మాట్లాడుతున్నారు అంటే ఈ సినిమా ఎంతటి సంచలనం సృష్టిస్తుందో అర్ధం చేసుకోవచ్చు, కొన్ని రాష్ట్రాలు బాన్ చేస్తుంటే, ఉత్తర ప్రదేశ్-మధ్య ప్రదేశ్ లాంటి రాష్ట్రాలు మాత్రం ది కేరళ స్టొరీ సినిమాని టాక్స్ ఫ్రీ సినిమాగా ప్రకటించాయి. కేవలం నాలుగు రోజుల్లో 45 కోట్లు రాబట్టిన ది కేరళ స్టొరీ సినిమాపై CBFC స్పందించింది. సెంట్రల్ బర్డ్ క్లియరెన్స్ ఇచ్చిన తర్వాత ఒక సినిమాని ఎలా బాన్ చేస్తున్నారు అంటూ ప్రెస్ నోట్ రిలీజ్ చేశారు. బాన్ చేసే ప్రతి రాష్ట్ర ప్రభుత్వాన్ని వెంటనే ఎందుకు బాన్ చేస్తున్నారు అనే విషయంలో స్పందించాలని CBFC కోరింది. మరి ఈ విషయంలో ది కేరళ స్టొరీ సినిమాని బాన్ చేసిన రాష్ట్రాలు ఎలా రెస్పాండ్ అవుతాయో చూడాలి.